Rajamouli:టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి హవా మామూలుగా లేదు. ఆయన దెబ్బకు టాలీవుడ్ బడా స్టార్లయిన మహేశ్, పవన్ లాంటి వారే తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. మహేశ్ సర్కారు వారి పాటను, పవన్ భీమ్లా నాయక్ సినిమాలను వెనక్కు జరుపుకున్నారు. ఇప్పుడు రాజమౌళి సెగ ఏకంగా బాలీవుడ్ ను (bollywood) కూడా తాకింది.
Rajamouli: “RRR” కంటే అతిపెద్ద సౌత్ ఇండియా క్రేజీ కాంబినేషన్ ప్రాజెక్ట్ రాజమౌళి..??
బాలీవుడ్ బడా డైరెక్టర్ భయపడ్డాడా..?
బాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలు తీస్తాడని పేరున్న సంజయ్ లీలీ భన్సాలీ స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తున్న అలియా భట్ తో తీసిన సినిమా గంగూభాయ్ కతియావాడి. ముంబైని ఏలిన లేడీ డాన్ గంగూభాయి నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను ఫిబ్రవరి 18కి వాయిదా వేస్తున్నట్లు ఈ సినిమా మేకర్స్ ప్రకటించారు.
Rajamouli: రాజమౌళి తో అల్లు అరవింద్ బిగ్ ప్లాన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్..??
ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ అదే మరి..
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్(RRR) సినిమాను దాదాపు 400 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ బ్యూటీ హాట్ గాళ్ అలియా భట్ కూడా ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా చేస్తోంది. మరో హీరోయిన్ గా హాలీవుడ్ ముద్దుగుమ్మ నటిస్తోంది. షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.
Rajamouli: రాజమౌళిని తక్కువ అంచనా వేసిన మెగా, నందమూరి ఫాన్స్కి భారీ షాక్ …!
ఈ సినిమాను ఈ సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. 1920 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ చేసిన నాటు నాటు అనే పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డ్యాన్స్ స్టెప్పులు మామూలుగా లేవు. కోవిడ్ (COVID) కారణంగా ఈ సినిమా ఇన్నాళ్లు లేట్ అయింది. లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యేది.