NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రజని ఓ నాన్చుడు బేరం : తమిళనాడులో వింత రాజకీయాలు

                               (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి)

బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే అంటూ ఒక ట్రెండ్ సెట్ చేసిన రజనీకాంత్ కనీసం డైలాగ్ చెప్పలేకపోతున్నారు… కనీసం బయటకు రాలేక పోతున్నారు…. అదేంటి రజనీకాంత్ కి ఏమైంది అనుకుంటున్నారా???

(అదెలా అంటే )

 

రజనీకాంత్ అంటేనే తమిళనాడులో ఓ పూనకం. ఆయన సినిమాలకు ఓపెనింగ్స్ తో పాటు, ఆయన డైలాగ్ చెబితే తమిళనాడు అంతా ఆగిపోతుంది. విశేషమైన ప్రజాభిమానం రజిని సొంతం. తమిళనాడు లోని గ్రామాలకు వెళ్లిన రజనీ అభిమానులు కనిపిస్తారు. శివాజీ గణేషన్ తర్వాత తమిళలు అందరి అభిమానం చూరగొన్నది రజినీ ఒక్కడే. ఎంతో పేరున్న సినిమాల్లో భారీ డైలాగులు సింగిల్ టేక్లో చెప్పే రజనీకాంత్ రాజకీయాల్లో దిగేందుకు ముందుకు సాగేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. ప్రతిసారి అభిమానుల సమావేశం అంటూ ఏర్పాటు చేసి కేవలం ఫోటోలు దిగి వారిని పంపించే రజనీకాంత్ ఆదివారం మరోసారి అభిమానులతో సమావేశం అవుతున్నారు. వచ్చే ఏడాది మొదట్లోనే తమిళనాడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాలపై ఈ సమావేశంలో అయినా ఏదైనా నిర్ణయం తీసుకుంటారా లేక అభిమానులకు ఫోటో లు ఇచ్చి సరి పెడతారా అని తమిళ మీడియా ఎదురుచూస్తోంది. ఒకవేళ రజినీకాంత్ నుంచి రాజకీయాల ప్రకటన వస్తే మాత్రం తమిళనాడు రాజకీయాల్లో కొత్త మార్పులు కనిపిస్తాయి. రజనీకాంత్ ఈ తమిళనాడు ఎన్నికలకు సన్నద్ధం అయినట్లే ఒక ప్రకటన చేస్తే మాత్రం జాతీయ రాజకీయాలన్నీ తమిళనాడు వైపు చూస్తాయి. అందుకే ఈ ఆదివారం రజనీకాంత్ అభిమానుల సమావేశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఎందుకీ గందరగోళం?

రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజినీకాంత్ సుమారు ఏడాది క్రితమే ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి సొంత పార్టీ పెడతారని ప్రచారమూ జరిగింది. అయితే రజనీకాంత్ పార్టీ విషయంలో మాత్రం ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు. పార్టీ పేరు ఇప్పటివరకు ప్రకటించలేదు. అప్పుడప్పుడో మీడియా ముందుకు వచ్చి తమ పార్టీ ఆధ్యాత్మిక సిద్దాంతంతో వెళ్తుందని చెప్పడం తప్ప పార్టీపై రజనీకాంత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రతి దానికి సమయం వస్తుంది అంటూ కాలం గడిపేస్తున్నారు. ప్రతిసారీ రజనీకాంత్ అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు పార్టీ పేరు విధివిధానాలు బయటకు వస్తాయని అంతా భావించారు. అయితే దీనిపై రజనీకాంత్ లో అంత ఆసక్తి కనిపించలేదు.

బీజేపీ లైట్

రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన చేసిన వెంటనే రజినీకాంత్ ను బుట్టలో వేసుకునేందుకు బిజెపి తీవ్రంగా ప్రయత్నించింది. ఆయన కొన్ని సార్లు బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు ఇవ్వడంతో ఆయన కచ్చితంగా బీజేపీలో కలుస్తాడని భావించారు. కొందరు బిజెపి నాయకులు సైతం దీనిపై చేసిన కొన్ని వ్యాఖ్యలు రజినీకాంత్ భాషా జెండా ఎగుర వేస్తారని, దక్షిణాదిన బలహీనంగా ఉన్న బిజెపి కు ఇది ప్లస్ అవుతుందని భావించారు. అయితే రజనీకాంత్ దీన్ని కొట్టి పారేశారు. తాను బిజెపి లోకి వెళ్లడం అని స్పష్టం చేశారు. దీంతో కొన్ని నెలలపాటు రజనీకాంత్ ని నెత్తిన పెట్టుకున్న బిజెపి రూట్ మార్చింది. రజనీ వద్ద నుంచి రాజకీయాల పై ఎలాంటి ప్రకటనా రాకపోవడంతో అతని లైట్ తీసుకుంది. అన్నాడీఎంకేతో బీజేపీ కు ఎలాగూ పొత్తు ఉంది కాబట్టి రజినీ అవసరం లేదని ఆయనను పక్కన పెట్టింది. దీని తర్వాత రజినీకాంత్ రాజకీయాలపై ప్రకటనలు చేయడం మానేశారు.

ఆధ్యాత్మిక రాజకీయాలేల?

రజినీకాంత్ పార్టీని పేరును పార్టీ సిద్ధాంతాలను ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే తమ పార్టీ ఆధ్యాత్మిక కోణం లోనే ఉంటుందని చెప్పడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఒక రాజకీయ పార్టీ ఆధ్యాత్మిక సిద్ధాంతాలతో అధికారం వైపు ఎలా వెళుతుందని, అసలు రజినీకాంత్ పార్టీ పెట్టడమే ఇష్టం లేదని ప్రచారం జరిగింది. ఆధ్యాత్మిక సిద్ధాంతాలతో రజనీకాంత్ ఒక మటన్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని, ఇదే ఆయన మనసులో మాట అంటూ తమిళ విస్తృత ప్రచారం జరిగింది. అయితే తర్వాత కమల్ హాసన్ పార్టీ తో జత కట్టి తమిళనాడు రాజకీయాలు చేస్తామని ఇరుపార్టీలు కలిసి పోరాడుతాయి అంటూ ప్రకటించారు. దీని తర్వాత కమల్ సైతం పలు మార్లు రజనీకాంత్ ను కలిశారు. పార్టీపై ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రచించాలని, పార్టీ నిర్మాణం పై ముందుకు సాగాలని కమ్మలు సూచించిన రజినీ పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. దీంతో రజనీ పార్టీపై తమిళనాడు మీడియా పట్టించుకోవడం కూడా మానేసింది.

పోటీ చేస్తారా??

తమిళనాడు ఎన్నికలు దగ్గర పడ్డాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వానికి డీఎంకే గట్టిగా సమాధానం ఇస్తోంది. ఇక్కడ ప్రధాన పోటీ అన్నాడీఎంకే డీఎంకే ల మధ్యనే ఉంటుంది. డీఎంకేకు కాంగ్రెస్ మిత్ర పక్షం అయితే అన్నాడీఎంకేకు బిజెపి మిత్రపక్షం. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో ఉన్న ఆ పార్టీ కు అంత బలం లేదు. ఇక అక్కడ చిన్నచితకా పార్టీలు ఉన్నా అవి స్థానికంగానే ప్రభావం చూపిస్తాయి. కమల్ పార్టీ “మక్కల్ నీది మయం” పెట్టినా అది జనంలోకి అంతగా వెళ్ళలేదు. రజనీకాంత్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో వచ్చి పార్టీ ప్రకటనతో పాటు పార్టీ నిర్మాణం జరిగి జనంలోకి వెళ్తే ఇరు పార్టీలు బలపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ సమయంలో రజినీకాంత్ పార్టీ ఎప్పట్లాగే ప్రకటన ఉండబోదని అంచనా. సరిగ్గా ఎన్నికలకు ముందు రజనీకాంత్ పార్టీ పేరు ప్రకటించి జనంలోకి వెళ్తే ప్రభావం చూపగలరు గాని ఒక సిద్ధాంత పరంగా ప్రణాళికా పరంగా ఎప్పటి నుంచి ముందుకు సాగితే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి. తమిళనాడు రాజకీయాల్లో మార్పు చూడవచ్చు.

author avatar
Special Bureau

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N