Rajinikanth: ఇండియన్ జేమ్స్ బాండ్ క్యారెక్టర్ చేయబోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్..??

Share

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అనేక క్యారెక్టర్లు చేయడం తెలిసిందే. రజినీ ఎటువంటి క్యారెక్టర్ వెండితెర పై ప్లే చేసిన.. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కలిగిన రజినీ ఇటీవల రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రయత్నించి మధ్యలోనే నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగింది. ఆ తర్వాత అనారోగ్యం కారణంగా అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని ఇటీవల తిరిగి చెన్నైకి చేరుకోవడం జరిగింది. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని ఇటీవల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ కోసం కోల్కతా వెళ్ళటం షూటింగ్లో పాల్గొనడం జరిగింది.

For de-escalation, PLA must pull back its troops,' Ajit Doval's message to  China was clear as they agreed to withdraw

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఇండియన్ జేమ్స్ బాండ్ క్యారెక్టర్ రజిని చేయబోతున్నట్లు కోలీ వుడ్ వర్గాల టాక్. విషయంలోకి వెళితే భారతీయ గూడచారి గా పాకిస్థాన్ దేశంలో అనేక సంవత్సరాలు ఉండి వాళ్ళ రహస్య విషయాలను ఇండియాకి చేరవేస్తూ పేరుపొందిన అజిత్ దోవల్ బయోపిక్ లో రజినీకాంత్ నటించడానికి రెడీ అయినట్లు సమాచారం. అజిత్ దోవల్ తెలియని వారు ప్రపంచంలో ఎవరూ ఉండరు. ముఖ్యంగా పాకిస్తాన్ దేశానికి ముచ్చెమటలు పట్టించిన వ్యక్తి. అటువంటి క్యారెక్టర్ చేయడానికి రజనీ రెడీ అయినట్లు తమిళ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Read More: Rajinikanth: కలకత్తా కి బయల్దేరిన సూపర్ స్టార్ రజినీకాంత్..!!

పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అజిత్ దోవల్ ప్రస్తుతం ప్రధాని మోడీ కి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా రాణిస్తున్నారు. అదే రీతిలో ఇండియా పాకిస్తాన్ గొడవ కి కారణమైన జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి స్పెషల్ స్టేటస్ తీసివేయడం లో అదే రీతిలో సమస్యాత్మకమైన ప్రాంతం లో అజిత్ దోవల్ ఇచ్చిన సూచనలు చాలావరకు భారత ప్రభుత్వానికి మేలు చేయడం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ఇటువంటి డిఫరెంట్ లెజెండ్ డైనమిక్ పర్సనాలిటీ క్యారెక్టర్ లో రజిని నటించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.


Share

Related posts

`మ‌ల్లేశం`కు కె.టి.ఆర్ అండ‌

Siva Prasad

కులం కూడు పెట్టదు: పృథ్వీ

Siva Prasad

Tollywood : మల్టీస్టారర్స్ మీద క్రేజ్ పెరుగుతోంది..బడ్జెట్ కూడా అంతే పెటాల్సి వస్తోంది..!

GRK