NewsOrbit
Featured న్యూస్

వివాదం లో విడదల రజిని !

పుట్టినరోజు నాడు చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని ఒక వివాదంలో చిక్కుకున్నారు.అమెబర్త్ డే వేడుకల సందర్భంగా చిలకలూరిపేట పట్టణం లో వెలసిన అనేక ఫ్లెక్సీల్లో దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలు లేకపోవటం వైసీపీ శ్రేణులను విస్మయపరిచింది.

దీంతో రజనీ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు టిడిపిలో ఉన్న రజని అకస్మాత్తుగా వైసీపీలో చేరారు.టిడిపిలో ఉన్నప్పుడు ఆమె తన వాగ్ధాటితో రాజశేఖరరెడ్డిని ,జగన్ ని ఏకిపారేసిన సందర్భాలున్నాయి.అప్పటి అవసరాన్నిబట్టి చిలకలూరిపేటలో రేసుగుర్రం కావాల్సిన నేపథ్యంలో జగన్ పార్టీలో చేర్చుకుని టికెట్ కూడా ఇచ్చారు .

వైసిపి గాలిలో ఆమె గెలిచేశారు.చంద్రబాబు నాయుడు కేబినెట్ లో కీలక పాత్ర పోషించిన పత్తిపాటి పుల్లారావు ను ఓడించడంతో ఆమె జెయింట్ కిల్లర్ అని కూడా అనిపించుకున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇదంతా తన గొప్పతనమేనని రజని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె వాపును చూసుకొని బలుపు అనుకుంటున్నట్టున్నారే  అని చర్చ వైసీపీ క్షేత్రస్థాయి నేతల్లో సాగుతోంది.నిజానికి ప్రజల్లో లేని వాళ్లను కూడా జగన్ గెలిపించాడు. కేవలం  జగన్ పై  నమ్మకంతో జనాలు వైసీపీ ఫ్యాన్ గుర్తుకు వేసి తమ ఎమ్మెల్యే ఎవరన్నది కూడా చూడకుండా గుద్దేశారు.ఆ సునామీ లోనే చిలకలూరిపేటలో రజని విజయం సాధించారు.

కానీ రజని వ్యవహారశైలి తాను పార్టీ కన్నా గొప్ప అన్నట్లుగా ఉందని విమర్శలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే బుధవారం అమె పుట్టినరోజు వచ్చేసింది.ఇలాంటి కరోనా టైం అని కూడా చూడకుండా పెద్ద పెద్ద హోర్డింగ్ లను పెట్టి ఆ హోర్డింగ్ ల మీద తన పుట్టిన రోజు శుభాకాంక్షలను వేసుకుంది. అయితే అందులో వైఎస్ ఆర్ ఫొటో లేకుండా ఉండడం చూసిన వైసీపీ శ్రేణులు అవాక్కయ్యాయి. కావాలనే వైఎస్ ఆర్ ఫొటో లేకుండా విడుదల రజినీ ఫోకస్ అవుతున్నారని అని నియోజకవర్గంలో ప్రజలు – వైఎస్ఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నుంచి తీసుకొచ్చి ఎమ్మెల్యే సీటు ఇస్తే వైఎస్ ఆర్ ఎందుకు గుర్తు ఉంటారు అని వారు మండిపడుతున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం చిలకలూరిపేటలో చిలికి చిలికి గాలివాన అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి.

author avatar
Yandamuri

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N