Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రతి ఏడాది అమెరికా వెళ్ళినట్లు ఈ ఏడాది కూడా అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే. హెల్త్ చెకప్ కోసం దాదాపు 20 రోజుల పాటు అమెరికాలో ఉన్న రజిని.. అక్కడ అన్ని పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వైద్యులు రజిని ఆరోగ్యం పూర్తిగా బాగుందని సర్టిఫికెట్ ఇవ్వటంతో ఇటీవల అమెరికా నుండి చెన్నైకి చేరుకున్నారు రజిని. ఈ క్రమంలో కొద్దిరోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపిన రజిని తర్వాత కొద్ది రోజుల క్రితం అభిమానులతో మీటింగ్ ఏర్పాటు చేయడం తెలిసిందే.
ఈ సందర్భంగా మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు అనేక వార్తలు వచ్చిన నేపథ్యంలో.. అటువంటి ఆలోచనలు తనకు లేవని అభిమానులకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా రజినీకాంత్ మళ్లీ షూటింగ్ కి రెడీ అయిపోయారు. అన్నాత్తె కి సంబంధించిన చివరి షెడ్యూల్ కలకత్తా షెడ్యూల్ కంప్లీట్ చేయడానికి.. రజిని కలకత్తా కి బయలుదేరారు. మరికొద్ది రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేసి.. బ్యాలెన్సింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలని రజిని ఫుల్ గా డిసైడ్ అయ్యారు. ఏది ఏమైనా ఇక నుండి పూర్తిగా సినిమాలపై నా దృష్టి పెట్టాలని రజినీకాంత్ డిసైడ్ అవ్వడం జరిగిందట. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లకూడదని స్ట్రాంగ్ గా మైండ్ లో ఫిక్స్ అయ్యారట.
Read More: Rajinikanth: మళ్లీ అభిమానులతో సమావేశం అయినా రజినీకాంత్..!!
వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే అప్పట్లో పొలిటికల్ ఎంట్రీ ఉన్నట్లు రజిని ఘనంగా తెలపడం జరిగింది. అదే రీతిలో గత ఏడాది డిసెంబర్ మాసంలో పార్టీ సిద్ధాంతాలు.. పార్టీ పేరు ప్రకటించాలి అనుకుంటున్న టైమ్ లో రజనీ ఒక్కసారి అస్వస్థతకు గురి కావడంతో వెంటనే హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో జాయిన్ అయిన తర్వాత తాను రాజకీయాల్లోకి వెళ్ళటం భగవంతునికి ఇష్టం లేదని మూడు పేజీల లీటర్లు అభిమానులకు రాసి క్షమాపణలు కోరారు. ఇక ఆ తర్వాత అమెరికాకు వెళ్లి పూర్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని మళ్లీ ఇప్పుడు సినిమా రంగంలో కొనసాగుతూ వస్తున్నారు.