కొద్ది నెలల్లో ఎన్నికలు జరుగతున్న వేళ తమిళనాట రాజకీయాలు వేగంగా మారిపోనున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశ మూహూర్తం ఖరారు అయ్యింది. రజనీ రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఎప్పటి నుండో ఊహాగానాలు సాగుతున్నాయి. పలు పర్యాయాలు అభిమాన సంఘ నేతలతో రజనీ కాంత్ సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు గానీ ఇంత వరకూ పార్టీ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన అభిమాన సంఘ నేతల సమావేశంలో పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారని అందరూ భావించారు. కానీ రజనీ వెల్లడించారు.
అయితే తాజాగా ఈ రోజు ట్విట్టర్ వేదిగా రజనీ స్వయంగా పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. జనవరి నెలలో రాజకీయ పార్టీ ప్రారంభిస్తాననీ, దీనికి సంబంధించి వివరాలు ఈ నెల 31న వెల్లడిస్తామని ప్రకటించారు. ఈ పరిణామం తమిళ రాజకీయాలలో పెను సంచలనమే అవుతుందని అనుకుంటున్నారు.