Rajnikanth: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవలే అమెరికాకు వెళ్లి వైద్య చికిత్సలు చేసుకోవడం తెలిసిందే. ప్రతి ఏడాది వెళ్లినట్టు గానే ఈ ఏడాది కూడా వెళ్లి.. వైద్య పరీక్షలు చేయించుకోగా రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు .. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యులు తెలియజేయడం జరిగింది. దాదాపు 20 రోజుల పాటు అమెరికాలో ఉన్న రజిని నిన్నే చెన్నై కి చేరుకున్నారు.
ప్రస్తుతం శివ అ దర్శకత్వంలో సినిమా చేస్తున్న రజినీకాంత్.. త్వరలో కూతురు సౌందర్య దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆలోచన చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు రావడం జరిగాయి. ఇదిలా ఉంటే రజనీకాంత్ కెరీర్ లో 170 సినిమా.. తమిళ స్టార్ హీరో అల్లుడు ధనుష్ దర్శకత్వంలో.. తెరకెక్కనున్నట్లు సమాచారం. ధనుష్ ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పై కూర్చున్నట్లు త్వరలోనే పూర్తి కథ సెట్ చేసి .. రజనీకాంత్ కి వినిపించనున్నట్లు సమాచారం.
Read more: Rajinikanth: కేంద్ర ప్రభుత్వాన్ని పరిమిషన్ అడుగుతున్న రజినీకాంత్ కుటుంబం..!!
అంతే కాకుండా అంతా ఓకే అయితే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టు టాక్. అందుతున్న సోర్స్ ప్రకారం సినిమాలో చాలా స్టైలిష్ పాత్రలో రజనీకాంత్ నీ చూపించే విధంగా ధనుష్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ప్రస్తుతం రజనీకాంత్.. కొద్దిరోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకుని.. ఆ తరువాత వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడట. మరో పక్క రజిని కాంత్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా రజినీకాంత్ 170 ఓ సినిమా చాలా డిఫరెంట్ గా మాత్రం.. ఉండే రీతిలో ధనుష్ ఆలోచన చేస్తున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.