లోక్ సభలో గందరగోళం-రాజ్యసభ వాయిదా

సుదీర్ఘ విరామం అనంతరం ఈ రోజు ప్రారంభమైన పార్లమెంటు ఉభయ సభలలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాఫెల్ డీల్ పై ఉభయ సభలలోనూ తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకుపోయి నినాదాలతో సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో లోక్ సభను స్పీకర్ మధ్యాహ్నానికి వాయిదా వేశారు.

ఇక రాజ్యసభ ఏకంగా రేపటికి వాయిదా పడింది. కాగా లోక్ సభలో ఈ రోజు వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో మధ్యాహ్నం కూడా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి. ఇక పార్లమెంటు బయట తెలుగుదేశం సభ్యులు ప్రత్యేక హోదా కోసం ఈ రోజు కూడా నిరసన తెలుపుతూ ఆందోళనకు దిగారు.