NewsOrbit
న్యూస్ సినిమా

తనకి కాబోయేవాడి గురించి బయటపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్..!

Share

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఫేమస్ అయింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ మధ్య కాలంలో రకుల్ తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో హిందీ సినిమాలు చేసుకుంటూ వస్తుంది. అంతేకాదు శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ఇండియన్ 2 ల తో పాటు మరికొన్ని తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ మధ్య అందరూ వరసగా పెళ్ళి చేసుకొని ఒక ఇంటివారౌవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ తల్లి .. రకుల్ ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

 

ఇలాంటి సమయంలో తనని పెళ్ళి చేసుకోమని తొందర పెట్టలేము. తను ఎప్పుడు పెళ్ళి చేసుకుంటా అంటే అప్పుడే తను కోరుకున్న అబ్బాయితో పెళ్లి చేస్తామని తెలిపింది. మొత్తానికి ఈ రకంగా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి గురించి అసలు విషయం బయటపడింది. అంతేకాదు రకుల్ కాబోయే భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా బయట పెట్టింది. రకుల్ కి అంతకముందు కాబోయే భర్త విషయంలో పెద్ద లిస్ట్ ఉండేదట. కాని ఇప్పుడు నేను చేసుకోబోయే అబ్బాయి నా పని మీద ఇష్టం గౌరవం ఉన్నవాడు కావాలని తెలిపింది. తెలివైన వాడు అయ్యి ఉంటే చాలట. అంతకు మించి అతని దగ్గర ఉండాల్సిందేమి లేదని తెలిపింది. మొత్తానికి చాటడంత లిస్ట్ పెట్టుకున్న రకుల్ ఇప్పుడు సింపుల్ గా వ్యవహారం తేల్చేసింది.

ఇక రకుల్ ఆ మధ్య హిందీలో అజయ్ దేవగణ్ టబు లతో నటించిన దే దే ప్యార్ దే సినిమా తో హిట్ అందుకుంది. ప్రస్తుతం ఇండియన్ 2, అయిలాన్, చలే చలో, అటాక్ సినిమాలు చేస్తుంది. ఇక టాలీవుడ్ లో కూడా యంగ్ హీరో నితిన్ సరసన నటించబోతుందన్న వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయం ఇంకా అధికారకంగా వెల్లడి కాలేదు. నాగార్జున సరసన చేసిన మన్మధుడు 2 భారీ ఫ్లాప్ గా మిగిలిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ఠ్యా టాప్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తగ్గించడంతో పాటు కాస్త రేస్ లో వెనకబడ్డ రకుల్ లాంటి వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇవ్వాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. మరి ఇది రకుల్ కి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.


Share

Related posts

కరోనా పరీక్షలలో రికార్డ్ సృష్టించిన ఏపీ ప్రభుత్వం..! ఎన్ని టెస్టులో తెలిస్తే వావ్ అనాల్సిందే..!!

somaraju sharma

బ్రేకింగ్ : మళ్లీ దొంగ దెబ్బ తీసిన చైనా..! జాగ్రత్తగా ఉండండి అంటున్న కేంద్రం

arun kanna

SVP: వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం.. సర్కారు వారి పాట డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు..!!

sekhar