టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

జవాన్ల కు “రక్ష”ణ ఇలా..!!

Share

మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీలో కూడా అనేక మార్పులు వచ్చాయి. అత్యవసర సమయాల్లో జవాన్ల క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటం లో అంబులెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు అంటే మారుతి సుజుకి ఓమ్ని,  టెంపో ట్రావెలర్ వాహనాలు గుర్తొస్తాయి. మారుతున్న టెక్నాలజీ తో పాటు అంబులెన్స్ లు కూడా తన రూపాన్ని మార్చుకుంటున్నాయి.‌. తాజాగా DRDO & CRPF సంయుక్తంగా సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ కాసే జవాన్లు కోసం రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిళ్లను మొబైల్ అంబులెన్స్ లు గా అభివృద్ధి చేశారు.. !ఈ మొబైల్ అంబులెన్స్ సంబంధించిన పూర్తి సమాచారం ఇలా..

 

 

Raksha mobile ambulance launch for soldiers

భద్రతా దళాల సిబ్బంది కోసం  సత్వర వైద్యం అందించేందుకు వీలుగా వీటిని రూపొందించారు నాలుగు చక్రాల వాహనాలు ప్రయాణించాలేని ప్రదేశాలలో ఈ మొబైల్ అంబులెన్సులు అలవోకగా చేరుకునేలా తయారు చేశారు. ఉగ్రవాద దాడులు, యుద్ధాల లో గాయపడిన భద్రత దళాల సిబ్బందిని త్వరితగతిన ఆసుపత్రులకు చేరవేసేందుకు వీటిని ఉపయోగిస్తారు. అంతేకాకుండా జవాన్లు కు అత్యవసర వైద్య సహాయం అవసరమైనప్పుడు వీటిని ఉపయోగిస్తారు. ఈ ప్రత్యేక మొబైల్ బైక్ అంబులెన్సు లను రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటర్లు సైకిల్ ను ఉపయోగించి తయారు చేశారు.

Raksha mobile ambulance launch for soldiers

ఈ అంబులెన్సు లు కోసం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోటర్లు సైకిళ్ల ను ప్రత్యేకంగా మోడీపై చేశారు. ఈ బైక్ అంబులెన్స్ లకు “రక్ష” అనే పేరు కూడా పెట్టారు ఇందులో pillion rider సీట్ స్థానంలో స్ట్రక్చర్ ను ఏర్పాటు చేశారు. ఈ స్ట్రక్చర్ ను క్షతగాత్రుల గాయాల తీవ్రతను బట్టి పడుకోబెట్టడం, కూర్చోబెట్టడం వారి పరిస్థితి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.ఈ ప్రయాణంలో పేషెంట్ కదలకుండా ఉండేందుకు తల నుంచి కాళ్ల వరకు సేఫ్టీ బెల్టులు కూడా ఏర్పాటు చేశారు.ఈ రక్షా బైక్ ఆంబులెన్స్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్,  అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు ఆక్సిజన్ సిలిండర్ వంటి వైద్య పరికరాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ అంబులెన్స్ లో సైరన్ , జిపిఎస్ ట్రాకింగ్ తో కూడిన టాబ్లెట్స్ వంటి పరికరాలు ఉన్నాయి. ఈ స్ట్రక్చర్ ను బైక్పై అమర్చడం,  తొలగించడం చాలా సులువుగా చేయవచ్చు.


Share

Related posts

BJP : ఏపిలో రాజకీయ భూకంపం – ఫిబ్రవరి 14న ఏం జరగబోతోంది?

somaraju sharma

Viveka Murder Case: సీబీఐ దర్యాప్తు తీరుపై సుప్రీం కోర్టుకు వైఎస్ సునీతారెడ్డి..?

somaraju sharma

Sitting: కూర్చున్న చోటే వ్యాయామం చేయండిలా..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar