తమిళ హీరోపై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పొడుగుకాళ్ల సుందరి తెలుగుతోపాటు తమిళం మరియు హిందీ భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. లాక్ డౌన్ సమయం లో అనేక మందిని ఆదుకున్న ఈ ముద్దుగుమ్మ సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తి డ్రగ్స్ ఈ కోణంలో ఈ అమ్మడు విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తమిళ హీరో శివ కార్తికేయ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Rakul Preet Singh to star opposite Sivakarthikeyan in fantasy film? -  Movies Newsమేటర్ లోకి వెళ్తే శివ కార్తికేయ తో తమిళంలో ‘అయలాన్’ అనే సినిమా రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావంతో గత ఏడాది ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఆగిపోయింది. కొద్ది నెలల క్రితం ప్రారంభమైన ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ చివరి దశకు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో హీరో శివ కార్తికేయ గురించి తన మనసులో ఉన్న విషయాలు బయట పెట్టి. ఆయనతో నటించడం చాలా బాగా ఎంజాయ్ చేశాం అని తెలిపింది.

 

అంతే కాకుండా మంచి కో స్టార్ అని చెప్పుకొచ్చింది. అదేరీతిలో చెన్నైలో తనకి నచ్చిన ఆహారం ఎక్కడ దొరుకుతుందో శివ కార్తికేయ తెలిపే వాడని పేర్కొంది. షూటింగ్ జరుగుతున్నంతసేపు సెట్‏లో..శివ కార్తికేయ ఎప్పుడు జోకులు వేస్తూ నే ఉండేవాడిని పేర్కొంది. ఇదిలా ఉంటే సెట్ లో ఉన్నంతసేపు ఆయన నాతో ఇంగ్లీష్ మాట్లాడాలి అనే ఒప్పందం కుదిరింది అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.