Rakul Preet Singh: అక్కడ నా సినిమాలు 2022లో 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి..ఇక తెలుగు ఇండస్ట్రీతో పనేముంది రకుల్ ప్రీత్ సింగ్

Share

Rakul Preet Singh: కెరటం సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా తర్వాత నుంచి టాలీవుడ్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రారండోయ్ వేడుక చూద్దాం, లౌక్యం, కరెంట్ తీగ, బ్రూస్‌లీ, ధృవ, స్పైడర్ ఇలా పలు క్రేజీ మూవీస్‌లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేసిన స్పైడర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చూసింది. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ హవా తగ్గిపోయింది.

Rakul preet singh movies are going to release in 2022
Rakul preet singh movies are going to release in 2022

అదే సమయంలో పూజా హెగ్డే టాప్ గేర్ వేసి గ్లామర్ ట్రీట్ ఇస్తూ స్టార్ హీరోల సరసన క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు అందుకుంటూ పాపులర్ అయింది. టాలీవుడ్‌లో పెద్ద సినిమా అంటే పూజా పేరునే తలుచుకేనేలా మారింది. ఈమెకి తోడుగా రష్మిక మందన్న వచ్చి చేరింది. తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మొదటి సినిమాతో మంచి హిట్ అందుకుంది హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత దేవదాస్, గీత గోవిందం, డియ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి సినిమాలలో అవకాశాలు అందుకొని భారీ హిట్స్ అందుకుంది.

Rakul Preet Singh: కీర్తి సురేష్, సాయి పల్లవిలను తట్టుకోవడం రకుల్‌కి పెద్ద సవాల్‌గా మారింది.

దాంతో ఏకంగా అటు రష్మిక మందన్న, ఇటు పూజా హెగ్డేలకి క్రేజ్ విపరీతంగా పెరిగి పాన్ ఇండియన్ సినిమాలలో ఛాన్సులు దక్కించుకుంటున్నారు. మంచి ఫాంలో ఉన్నారు కాబట్టి సాధ్యమైనంతవరకు టాలీవుడ్ మేకర్స్ ఈ ఇద్దరినీ దాటి వెల్లడం లేదు. ఒకవేళ దాటినా కీర్తి సురేష్, సాయి పల్లవిలను ఎంచుకుంటున్నారు. ఇక యంగ్ బ్యూటీస్ కృతి శెట్టి, కేతిక శర్మ వైపు చూస్తున్నారు. వీరు కాకుండా తెలుగమ్మాయి రీతూ వర్మ మంచి ఫాంలో ఉంది. ఇలా ఒకవైపు గ్లామర్ బ్యూటీస్, మరొకవైపు డీసెంట్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్న కీర్తి సురేష్, సాయి పల్లవిలను తట్టుకోవడం రకుల్‌కి పెద్ద సవాల్‌గా మారింది.

ఇలాంటి నేపథ్యంలో నాగార్జునతో చేసిన మన్మధుడు 2 కూడా రకుల్ కెరీర్‌ను కిందకి లాగేసింది. లక్కీగా నితిన్ సరసన చెక్ సినిమాలో నటించే అవకాశం దక్కినా దానీ ఫలితం సున్నా. ఇప్పుడు రకుల్ హోప్స్ అన్నీ క్రిష్ – వైష్ణవ్ తేజ్‌ల కొండపొలం సినిమా మీదే. ఈ సినిమా మీద చిత్ర బృందం చాలా నమ్మకాలు పెట్టుకుంది. క్రిష్ సత్తా అందరికీ తెలుసు కాబట్టి కొండపొలం సినిమా గ్యారెంటీగా సూపర్ హిట్ అని ధీమాగా ఉన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా కొండపొలం సినిమా చూసి అద్భుతంగా ఉందంటూ.. ఖచ్చితంగా మూవీ సూపర్ హిట్ అని, క్రిష్ దర్శకత్వ ప్రతిభను పొగిడాడు. అనుకున్నట్టుగానే కొండపొలం సినిమాకి చాలా మంచి టాక్ వస్తోంది.

Rakul Preet Singh: బాలీవుడ్‌లో వచ్చే ఏడాది (2022) రకుల్ నటించిన 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఇందులో ఓబులమ్మగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాదు త్వరలో టాలీవుడ్‌లో రకుల్ కి వరుసగా అవకాశాలు దక్కడం ఖాయమని చెప్పుకుంటున్నారు. బాలీవుడ్‌లో వచ్చే ఏడాది (2022) రకుల్ నటించిన 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఓ మూడు సినిమాలు సూపర్ హిట్ అయినా ఇక ఆమె బాలీవుడ్‌లో పాతుకుపోయినట్టే. అయినా ఇటీవల కొండపొలం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలీవుడ్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా టాలీవుడ్ అవకాశాలు వస్తే వదిలే ప్రసక్తే లేదని ఎప్పటికీ తెలుగు సినిమాలలో నటిస్తూనే ఉంటానని తెలిపింది.


Share

Related posts

అర‌వింద స్వామే ఫోన్ చేశాడ‌ట‌!

Siva Prasad

విభజన చట్టంపై కేంద్ర హోం శాఖ సమీక్ష

sarath

ఈసారి అల్లు అర్జున్ టార్గెట్ అదే ..!

GRK