Alia Bhatt : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR ఇటీవల రిలీజ్ అయి, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఓ హీరోను ఎక్కువగా చూపించారని.. మరో హీరోను తక్కువగా చూపించారనే రూమర్స్ తో పాటుగా ఈ సినిమాకు సంబంధించి ఆలియా భట్ విషయమొకటి వినిపిస్తున్న విషయం తెలిసినదే. తన స్క్రీన్ ప్రెజెన్స్ అనుకున్న స్థాయిలో లేదని ఆమె ఫీల్ అవుతుందట.
Alia Bhatt : అందుకే అలా చేసిందా?
ఈ క్రమంలోనే ఆమె RRR గురించి ఎలాంటి పోస్టులు కూడా పెట్టడం లేదనే వాదన వినిపించింది. అయితే ఇలాంటి వార్తలకు ఆమె చెక్ పెడుతూ తాజాగా ఓ పోస్ట్ చేసింది. దాని సారాంశం ఏమంటే… అనవసర అపోహలు వద్దని, RRR సినిమాతో తనకున్న బంధం చాలా గొప్పదని ఆమె తెలిపింది. దేశం గర్వించదగ్గ దర్శకుడు అయినటువంటి రాజమౌళితో తన ప్రయాణం అమోఘం అని తెలిపింది. అలాగే తన కో స్టార్స్ ఐనటువంటి రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ తో తన ప్రయాణం గురించి రాసుకొచ్చింది.
వచ్చిన రూమర్స్ ఇవే:
సినిమా సక్సెస్ పార్టీలో ఆలియా ఎక్కడ కనిపించలేదని, ఈ క్రమంలో తాజాగా ఆమె సోషల్ మీడియాలో దర్శకుడు రాజమౌళిని అన్‌ఫాలో చేసినట్లు కూడా బయట వార్తలు వినిపించాయి. దర్శకుడు జక్కన్న-ఆలియా భట్ల మధ్య విభేదాలు వచ్చాయనే వార్తకి ఇప్పుడు ఆమె సమాధానం చెబుతూ పై విధంగా స్పందించింది. ఏది ఏదేమైనా అలియా చేసిన పోస్టుతోనైనా ఈ రోమర్స్ కి చెక్ పడాలని కోరుకుందాం.