మెగా ఫ్యామిలీ ఇంటి పెళ్లి సందడి మొదలైంది. మెగా డాటర్ నిహారిక కొణిదెలకు ఈరోజు నిశ్చితార్ధం జరగనుంది. తనకు కాబోయే వరుడు గురించి నిహారిక కొణిదెల ఇప్పటికే వివరాలు తెలిపిన విషయం తెల్సిందే. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లాడనున్నట్లు ఇప్పటికే తెలిసింది.
ఇక ఆగస్టులో నిశ్చితార్ధం ఉంటుందని తెలిపిన మెగా ఫ్యామిలీ ఈరోజు సింపుల్ గా ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ నిశ్చితార్ధ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కానున్నారు. నిహారిక కుటుంబానికి, చైతన్య కుటుంబానికి ఎప్పటినుండో పరిచయాలు ఉన్నాయి. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ఎన్నో ఏళ్లుగా ప్రాణ స్నేహితులని తెలుస్తోంది. దానివల్లనే ఈ సంబంధం సెట్ అయినట్లు సమాచారం. పెళ్లి ఎప్పుడనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!