Shankar : క్రియేటివ్ జీనియస్ శంకర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ప పాన్ ఇండియన్ సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఇది రామ్ చరణ్ 15గా రూపొందనుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా రోజులవుతోంది. ఎప్పుడైతే ఈ మూవీ ప్రకటన వచ్చిందో అప్పటి నుంచి ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ కేటాయించాడు దిల్ రాజు – శిరీష్. వీరు ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమా శంకర్ మార్క్ లోనే సామాజిక అంశాలతో, సందేశాత్మక అంశాలతో పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కించనున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. ఇక మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ప్రచారంలో ఉంది. అదేమిటంటే చరణ్ 15 గతంలో శంకర్ ..అర్జున్ తో రూపొందించిన ‘ఒకే ఒక్కడు’ సినిమా తరహాలో పొలిటికల్ నేపథ్యంలో ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఇందులో చరణ్ పొలిటీషియన్ గా కనిపిస్తారని తెలుస్తోంది.
Shankar : ‘చరణ్15’ తో డ్యూయల్ రోల్ లో ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.
ఇక శంకర్.. చరణ్ ని కొత్త మేకోవర్ తో చూపించబోతున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా మెగా అభిమానుల ఆనందం రెట్టింపయ్యే మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శంకర్ ఇందులో రామ్ చరణ్ ని డ్యూయల్ రోల్ లో చూపించనున్నాడట. గతంలో చరణ్ ‘నాయక్’ అనే సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి ‘చరణ్15’ తో డ్యూయల్ రోల్ లో ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి. ఈ సినిమా ప్రముఖ రచయిత బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు.