Ram Charan: ఇటీవలి కాలంలో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ‘RRR’ విజయంతో దూసుకుపోతున్న తెలుగు నటుడు రామ్ చరణ్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఊపుతో శంకర్ దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని బహుభాషా ప్రాజెక్ట్ కోసం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చిత్రీకరణలో వున్నారు మన రామ్ చరణ్. సోమవారం అక్కడ సెట్‌లో అభిమానుల కోలాహలం మధ్య వున్న వీడియో ఒకటి వైరల్‌గా మారిన సంగతి తెలిసినదే. దాంతో ఉత్తరాదిలో కూడా ఆయనకు ఉన్న పాపులారిటీని ఈ వీడియో తెలియజేసింది. చరణ్ తొలిసారి దర్శకుడు శంకర్‌తో కలిసి పనిచేయడం విశేషం.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇంతకీ పద్మశ్రీ తంతు ఏమిటి?
ప్రస్తుతం చరణ్ పూర్తిగా నలుపు రంగు దుస్తులలో కనిపిస్తున్నాడు. తెలిసిన వివరాల మేరకు చరణ్ ప్రస్తుతం అయ్యప్ప దీక్షను ఆచరిస్తున్నారు. అయితే తాజాగా ఓ పుకారు బయట వినబడటం మనం సోషల్ మీడియాలలో గమనించవచ్చు. అదే రామ్ చరణ్ కి పద్మశ్రీ ఇవ్వాలి అనే అంశం. మెగా అభిమానులు ఈ విషయమై కేంద్రాన్ని కోరుతున్నట్టుగా వచ్చిన వార్తలను కొంతమంది ఖండిస్తున్నారు. ఎవరో కావాలని సృష్టిస్తున్న వార్తలుగా తెలుస్తోంది. అయితే వీటికి కొంతమంది విచిత్రంగా రియాక్ట్ అవుతున్నారు. అప్పుడే చరణ్ కి పద్మ శ్రీ ఏంటి? అన్న భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇది అసలు సంగతి:
‘RRR’ విడుదల తర్వాత చరణ్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు ఒకింత నొచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే ఎన్టీఆర్, రామ్ చరణ్ స్నేహం గురించి అందరికీ తెలిసందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1000 కోట్ల పైనే కలెక్షన్లు కురిపించింది. రాజమౌళి ఇద్దరి పాత్రలను ఏవిధంగా మలిచాడో అందరికీ తెలిసిందే. ఇది అర్ధం కానీ ఎన్టీఆర్ అభిమానులు కాస్త నిరాశకు లోనయినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఇలాంటి పుకార్లు సోషల్ మీడియాలో పుడుతున్నాయని అంటున్నారు.