NewsOrbit
న్యూస్ సినిమా

Ram Charan: ఆ ముగ్గురు అభిమానుల పనికి ముగ్ధుడైన రామ్ చరణ్!ఇంతకీ వారు చేసిందేంటంటే??

Ram Charan: ఒకప్పుడు రాజకీయ నాయకుల పాదయాత్రల సీజన్ నడిచింది.డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తో మొదలైన ఈ ఫార్ములా ఆయన కుమారుడు జగన్ వరకు కొనసాగింది. మధ్యలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు,జగన్ సోదరి షర్మిల కూడా పాదయాత్రలు సాగించారు.షర్మిల మినహాయిస్తే మిగిలిన అందరూ అందలం అందుకున్నారు.షర్మిల ఇప్పుడు తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Ram Charan is happy with the work of those three fans!
Ram Charan is happy with the work of those three fans

ఇది గతమైతే ఇప్పుడు సినీ హీరోల అభిమానుల పాదయాత్రల సీజన్ మొదలైంది.నిన్నగాక మొన్న కరోనా దేవుడు సోనూసూద్ ను కలుసుకోవడం కోసం హైద్రాబాద్ నుండి వెంకటేష్ అనే ఆయన అభిమాని ఏడు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ బొంబాయి వెళ్లిన విషయం గుర్తుండే ఉంటుంది.సోనూసూద్ ఆ వీరాభిమానికి సాదర స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చి పంపిన విషయం తెలిసిందే.బహుశా ఇదే ప్రేరణగా పనిచేసిందేమో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కూడా ఈ ఫార్ములానే ఫాలో అయిపోయి తమ అభిమాన నటుడ్ని కలుసుకున్నారు.

అసలేం జరిగిందంటే!

తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాకి చెందిన ముగ్గురు రామ్ చరణ్ వీరాభిమానులు మెగా పవర్ స్టార్ ని కలుసుకోవడానికి హైద్రాబాద్ కు పాదయాత్ర సాగించారు.సంధ్యా జయరాజ్ ,రవి,వీరేష్ లనే ఈ ముగ్గురు ఫ్యాన్స్ తమ ఊరి నుండి 231కిలో మీటర్లు నడిచి హైదరాబాద్ కి చేరుకున్నారు.ఇందుకు వీరికి నాలుగు రోజుల సమయం పట్టిందట.ఇంతగా కష్టపడి తనను కలుసుకోవడానికి వచ్చిన ఆ ముగ్గురు అభిమానులను చూసి రామ్ చరణ్ ముగ్ధుడైపోయాడు.వారికి అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా సుమారు గంటసేపు వారితో గడిపారు. నిజానికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో రామ్ చరణ్ చాలా బిజీగా ఉన్నప్పటికీ వారికి ఎక్కువ సమయం కేటాయించారు.ఆ ముగ్గురికీ ఆయన అద్భుతమైన ఆతిథ్యమిచ్చారట.అందరితో ఫొటోలు దిగారు.జీవితంలో స్థిరపడ్డానికి తనవంతు సాయం అందిస్తానని కూడా వారికి రామ్ చరణ్ అభయమిచ్చారు.వారిలో ఒక అభిమానిని రామ్ చరణ్ కౌగలించుకున్న ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీంతో తమ జీవితం ధన్యమైపోయిందని ఆ ముగ్గురు అభిమానులు హర్షాతిరేకంతో తమ ఇళ్లకు తిరుగుముఖం పట్టారు .

 

author avatar
Yandamuri

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu