Ram charan : రామ్ చరణ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ వల్లే స్పీడ్ తగ్గిందా..?

Share

Ram charan : టాలీవుడ్ లో చాలా డిలేగా సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సొంత ప్రొడక్షన్. బయట భారీ నిర్మాణ సంస్థలు, బాబాయ్‌ల అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్, అలాగే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్, జీఏ2..ఇన్ని ఉన్నా రామ్ చరణ్ సినిమాలు మాత్రం వరుసగా రావడం లేదు. చరణ్ చేయాలనుకుంటే ఏడాదికి 3 సినిమాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ కరోనా వల్ల ఒకరకంగా చరణ్ దూకుడు తగ్గితే ఆయన పాన్ ఇండియన్ సినిమాలు చేయాలని డిసైడవడమే మరొక బలమైన కారణం అంటున్నారు. మన్యం వీరుడు అల్లూరీ సీతారామరాజు పాత్రలో నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు.

ram-charan-is planning for pan indian movie
ram-charan-is planning for pan indian movie

ఈ సినిమా కోసం కారణం కరోనా తో పాటు ఇతర కారణాల వల్ల రెండేళ్ళు దాటిపోయింది. పక్కాగా ప్లాన్ చేసుకుంటే ఈ రెండేళ్ళలో చరణ్ నుంచి మూడు లేదా నాలుగు సినిమాలు వచ్చేవి. ఇప్పటికీ చరణ్ స్ట్రాంగ్ గా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేయాలని మాత్రమే డిసైడయి ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత దిల్ రాజు సంస్థలో శంకర్ దర్శకుడిగా సినిమా కమిటయ్యాడు. ఈ సినిమా ఇంకా ప్రీప్రొడక్షన్స్ వర్క్ పూర్తి కాకుండానే శంకర్ కి ఇండియన్ 2 సినిమా సమస్యలు చుటుముట్టాయి. దీనితో పాటు బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా చేయనున్నట్టు కమిటయ్యాడు.

Ram charan : : రామ్ చరణ్ బాలీవుడ్ లో స్ట్రైట్ సినిమా ..?

దాంతో శంకర్ తెరకెక్కించే చరణ్ సినిమా పూర్తి చేసేసరికి ఓ రెండేళ్ళు పడుతుందని అంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలందరు అఫీషియల్ గా 3 నుంచి 4 సినిమాలు ప్రకటించారు. కానీ చరణ్ కొత్త ప్రాజెక్ట్ అంటే ఒక్క శంకర్ – దిల్ రాజులదే. చరణ్ కోసం చాలా మంది దర్శకులు లైన్ లో ఉన్నారు. కానీ చరణ్ చాలా సెటిల్డ్ గా సినిమాలు కమిటవుతున్నాడు. మరి కొత్త ప్రాజెక్ట్ ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి. అయితే బాలీవుడ్ లో స్ట్రైట్ సినిమా చేయడానికి సైలెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడని ఇన్‌సైడ్ టాక్. ఆచార్య కూడా చరణ్ చేతిలో ఉంది. ఇందులో క్యారెక్టర్ చాలా హైలెట్ అవుతుందంటున్నారు.


Share

Related posts

పల్నాడు గనుల కేసు సిబిఐకి

somaraju sharma

పూరి హీరోయిన్స్ కోసం క్యూ కడుతున్న హీరోలు ..!

GRK

ఒంగోలుకు శిద్దా, దర్శికి ఉగ్రనర్శింహ

somaraju sharma