18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
న్యూస్ సినిమా

Ram Charan : రామ్ చరణ్ లేటెస్ట్ న్యూస్ మూవీ అప్ డేట్..!!

Share

Ram Charan : రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “RRR” చేస్తున్న సంగతి తెలిసిందే.

Ram Charan Latest News Movie Update .. !!
Ram Charan Latest News Movie Update .. !!

ఫస్ట్ టైం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చరణ్ స్క్రీన్ షేర్ చేసుకుని సినిమా చేస్తున్న నేపథ్యంలో పైగా బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా “RRR” సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఒకపక్క చేస్తూనే మరోపక్క కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” లో చరణ్ నటిస్తున్నాడు. అయితే ఈ రెండు తర్వాత చరణ్ నెక్స్ట్ సినిమా ఏంటి అన్నది మాత్రం మొన్నటి వరకు క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే గత కొంత కాలం నుండి చరణ్ నెక్స్ట్ సినిమా విషయంలో చాలా మంది డైరెక్టర్లు పేర్లు వినబడ్డాయి. వారిలో ఒకరు గౌతమ్ తిన్ననూరి. న్యాచురల్ స్టార్ నాని తో ‘జెర్సీ’ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా చేసి.. ఇండస్ట్రీలో టాప్ హీరోల చూపు తనవైపు పడేలా మంచి గుర్తింపు దక్కించుకోవడం జరిగింది. అంత మాత్రమే కాక ఫస్ట్ సినిమాతోనే మనోడి టేకింగ్ కు ఫిదా అయిన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.. ‘జెర్సీ’ సినిమాను బాలీవుడ్లోకి రీమేక్ చేయడమే కాకుండా తననే దర్శకుడిగా తీసుకున్నాడు. ఇటువంటి డిమాండ్ కలిగిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిలిం వర్గాలలో లేటెస్ట్ వార్త వైరల్ అవుతుంది. అదిరిపోయే సూపర్ స్క్రిప్టుతో చెర్రీని గౌతమ్ తిన్ననూరి మెస్మరైజ్ చేసినట్లు సమాచారం. అనుకున్నట్లు అంతా జరిగితే అధికారిక ప్రకటన త్వరలో రానున్నట్లు, అంత మాత్రమేగాక ఏప్రిల్ మాసం లో సెట్స్ పైకి వెళ్లి ఈ ఏడాది చివర్లో నే సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.


Share

Related posts

Color Foods: ఈ రంగులో ఉండే కూరగాయలు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!?

bharani jella

RRR: చరణ్ లో నేను నేర్చుకున్నది అదే రాజమౌళి సంచలన కామెంట్స్..!!

sekhar

NTR: ఎన్టీఆర్ కి జాగ్రత్తలు చెప్పిన చంద్రబాబు, లోకేష్..!!

sekhar