Ram Charan-Raviteja: రామ్ చరణ్-రవితేజ.. Ram Charan-Raviteja వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందంటే అంచనాలు హద్దులు దాటేస్తాయి. ఇద్దరు హీరోలకు మాస్ లో ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరూ కలిసి చేస్తే ధియేటర్లో అభిమానులకు పూనకాలే వచ్చేస్తాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది.. మంచి మల్టీస్టారరే అవుతుంది.. అనే అనుకుంటారు అంతా. అయితే.. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయడం లేదు. ఒకరి సినిమాలో మరొకరు నటిస్తున్నారు. అంటే.. రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ వార్త బాగా వైరల్ అయింది. ఇంతకీ ఏ సినిమా.. ఏంటా కథ అంటే..
రెండేళ్ల క్రితం మళయాళంలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’. ఈ సినిమాలో మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ ఒక పాత్రలో.. సూరజ్ నటించారు. మంచి ప్రజాదరణ దక్కించుకున్న ఈ సినిమా నచ్చి రామ్ చరణ్ గతంలోనే తెలుగు రైట్స్ తీసుకున్నాడు. అయితే.. సినిమాలో ఎవరు నటిస్తారనే విషయంలో ఎప్పటినుంచో ఊహాగానాలు వస్తున్నాయి. రామ్ చరణ్, పవన్ కల్యాణ్, వెంకటేశ్.. ఇలా పలువురి పేర్లు లైమ్ లైట్లోకి వచ్చాయి. అయితే.. ఇప్పుడీ ప్రాజెక్టును రవితేజతో తెరకెక్కిస్తున్నారనే వార్త వైరల్ అయింది. రవితేజ కూడా ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ నిర్మాతగా తమ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తారని అంటున్నారు.
Read More:Chiranjeevi Oxygen Banks: మీడియా తీరుపై చిరంజీవి నిర్వేదం..! మీడియా అధినేతతో ఫోన్ సంభాషణ..!
సినిమాలో సూరజ్ పోషించిన పాత్రను ఇప్పటికే వెంకటేశ్ వరకూ వెళ్లినట్టు టీటౌన్ సమాచారం. అయితే.. దీనిపై ఇంకా క్లారిటీ లేదని కూడా అంటున్నారు. ఇదే నిజమైతే టాలీవుడ్ లో మరో మంచి మల్టీస్టారర్ ఖాయమే అంటున్నారు. సినిమాలో ఇద్దరు హీరోల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు మళయాళ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి తెరకెక్కిస్తే మంచి విజయం ఖాయమనే రామ్ చరణ్ ఈ సినిమా రైట్స్ దక్కించుకున్నాడట. మరి.. ఈ సినిమాలో రవితేజ నటించడం.. మరో పాత్ర ఎవరు చేస్తున్నారనే విషయంపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?