‘వినయ విధేయ రామా’ లాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘RRR’ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ఈ ప్రాజెక్టులో సంవత్సరం నుండి వర్క్ చేస్తూనే ఉన్నారు. మధ్యలో అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ లు ఆగిపోవటంతో వచ్చే జనవరి మాసంలో ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి సినిమా యూనిట్ కృషి చేస్తోంది. ఫస్ట్ టైం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పైగా ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి సినిమా తెరకెక్కించడంలో దేశవ్యాప్తంగా కూడా ‘RRR’ పై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా సోలోగా రామ్ చరణ్ హీరోగా నెక్స్ట్ ఎవరితో ఏ డైరెక్టర్ తో చేస్తారు అన్న దాని విషయంలో మెగా అభిమానులకు ఇప్పటివరకు క్లారిటీ లేకుండా పోయింది. త్రివిక్రమ్ తో మరియు కొంతమంది డైరెక్టర్లతో రామ్ చరణ్ సినిమా చేస్తున్నట్లు వార్తలు మొన్నటి వరకు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొత్త డైరెక్టర్ సతీష్ అనే వ్యక్తి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు అని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా ఈ సినిమా మొదటిలో అల్లుఅర్జున్ చేయాల్సి ఉండగా, ఆ ప్రాజెక్ట్ నుండి బన్నీ సడన్ గా తప్పుకోవడంతో …సేమ్ స్టోరీని చెర్రీకి సతీష్ ద్వారా దిల్ రాజు వినిపించినట్లు సమాచారం. కాగా స్టోరీ అంతా బాగానే ఉండటంతో రామ్ చరణ్ సతీష్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.