Ram charan: మెగా అభిమానులు మాత్రమే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటి వరకు అపజయం అంటే ఏంటో తెలియని దర్శక దిగ్గజం బాహుబలి సినిమాలతో మన తెలుగు సినిమా సత్తా ఏంటో తెలిసేలా చేసిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు శక్తివంతమైన పోరాట యోధుల పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.
ఇలాంటి సినిమా మన ఇండియన్ స్క్రీన్ మీద రాబోతోందంటే హాలీవుడ్ మేకర్స్ సైతం ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూడాలా అనే ఆతృతతోనూ ఉన్నారు. బాలీవుడ్ అగ్ర నటీ నటులతో పాటు సౌత్‌లోని నటులు అలాగే హాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ ఓ సంచలనం సృష్ఠించబోతోంది. ఈ సంచలనం సృష్ఠించే పాన్ ఇండియన్ సినిమాలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్.టి.ఆర్ కొమురమ్ భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చరణ్ పాత్రకు సంబంధించి ఓ కొత్త టాక్ వినిపిస్తోంది.
Ram charan: చరణ్, తారక్ పాత్రల గురించి కనీసం ఓ పదేళ్ళు చెప్పుకుంటారు.
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్ కొన్ని కీలకమైన అంశాలలో క్లూస్ కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లూరిగా మాత్రమే కాకుండా మరో రెండు పాత్రల్లో చరణ్ కనిపించనున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా చరణ్ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన పాత్ర మూడు రకాల గెటప్పుల్లో కనిపిస్తుందట. ఈ మూడు రకాల గెటప్పులు అందరికీ ఊహించనివిధంగా సర్ప్రైజ్ చేస్తాయని అంటున్నారు. దాంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం, ఆతృత రెట్టింపయ్యాయి. మరి జక్కన్న చరణ్‌ను ఎలాంటి గెటప్పుల్లో చూపించబోతున్నారో చూడాలి. ఇక ఈ సినిమా గురించి ..ఇందులో చరణ్, తారక్ పాత్రల గురించి కనీసం ఓ పదేళ్ళు చెప్పుకుంటారని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు.