Ram charan: తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం..ఇలా భాష ఏదైనా చిన్న నుంచి పెద్ద హీరో వరకు ప్రతీ ఒక్కరికి డ్రీమ్ రోల్స్ అనేవి కొన్ని ఉంటాయి. కానీ అలాంటి కథ తయారు చేసే దర్శక, రచయితే అంత త్వరగా దొరకరు. దొరికినా హిట్ దక్కడం అనేది 50 – 50 ఛాన్సెస్. కాకపోతే డ్రీమ్ ప్రాజెక్ట్ చేశామనే ఓ సంతృప్తి మాత్రం దక్కుతుంది. అయితే పాన్ ఇండియన్ క్రేజ్ వస్తున్న సమయంలో డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ కొన్ని రిస్కులు చేయడం అభిమానులకు కాస్త టెన్షన్ పెట్టే విషయమే. ప్రతీ దర్శకుడు – హీరో – నిర్మాత హిట్ సినిమా తీయాలనే మొదలు పెడతారు. కానీ ఫైనల్‌గా అది డిసైడ్ చేయాల్సింది మాత్రం ప్రేక్షకులే.
ఇప్పుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ విషయంలో కొందరు ఫ్యాన్స్ ఒకింత టెన్షన్ పడుతున్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం చరణ్ తీసుకున్న ఓ షాకింగ్ డెసిషనే. ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. మరో పవర్ఫుల్ రోల్ కొమురమ్ భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు కలగడమే కాదు. ఈ ఇద్దరు హీరోలను పాన్ ఇండియన్ స్టార్స్‌గా ట్రీట్ చేస్తున్నారు.
Ram charan: చరణ్ ఎంత కథపై నమ్మకం కలగపోతే ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేస్తాడు..!
ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత అంతకు మించి అనేట్టుగా శంకర్ సినిమాను ప్రకటించి షూటింగ్ కూడా మొదలుపెట్టాడు చరణ్. అయితే అనూహ్యంగా యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యూవీ బ్యానర్ నిర్మించే సినిమాకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా చరణ్ ఒప్పుకోవడానికి కారణం ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే సినిమా కావడమే. ఇది చరణ్ డ్రీమ్ రోల్ అట. అందుకే గౌతమ్ కథ చెప్పగానే ఓకే చెప్పాడట. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు అంతగా ఆదరణ దక్కించుకోలేకపోయాయి. అదీ కాక ఇప్పుడు పాన్ ఇండియన్ క్రేజ్ వస్తున్న సమయంలో చరణ్ ఇలా యంగ్ డైరెక్టర్‌తో సినిమా అంటే పెద్ద సాహసం చేస్తున్నాడని ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారట. అయితే చరణ్ ఎంత కథపై నమ్మకం కలగపోతే ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేస్తాడనే మరో మాట కూడా వినిపిస్తోంది.అయితే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన సినిమాలన్నీ కమర్షియల్ సక్సెస్ చూసుకోకపోతే మాత్రం హీరోలకు మంచి పేరు, అవార్డులు తెచ్చిన సినిమాలుగా ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇలాంటి సినిమాలు ఏ హీరోకైనా చాలా అరుదుగా అవకాశం వస్తుంటుంది. అందుకే కమర్షియల్ హిట్ అని కాకుండా మంచి పేరు కోసం చేస్తున్నారు.