Ram Charan – Tarak : ఇపుడు ఎక్కడ చూసినా ఈ ఇద్దరి గురించే చర్చ. వారే మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎందుకంటే వీరు ఒక సినిమాలో కలిసి నటించారు కనుక. ఇక ఆ సినిమా విశేషాలు గురించి మీకు చెప్పాల్సిన పనిలేదు. అవును… ఆ పాన్ ఇండియా చిత్రం పేరే RRR. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా యంగ్ టైగర్ NTR కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకుని ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Ram Charan – Tarak : వీరు వెంటపడుతున్నది ఈమె వెనకే…
సినిమా రిలీజ్ అవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసారు. ఈ క్రమంలో చరణ్, తారక్, అలియా భట్ లు ఏ రేంజ్ లో రచ్చ చేస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. ముంబై ఈవెంట్లలో ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోడం, టీజ్ చేసుకోవడం… జరుగుతుంది. అందువలన వీరి ముగ్గురి మధ్య చాలా స్నేహ బంధం ఏర్పడింది. అలియాభట్ ఇద్దరితో కలిసి నటించడం ఇదే తొలిసారి అయినా చాలా ఎల్లా క్లోజ్ ఫీలింగ్ మనకు కనిపిస్తుంది. అలియాభట్ ఈ సినిమాకి కేటాయించింది కొన్ని రోజులే అయినా చాలా తక్కువ సమయంలోనే ముగ్గురు మంచి స్నేహితులయ్యారని ప్రచార కార్యక్రమాల్లో ఇట్టే తెలుస్తుంది.
ఖచ్చితంగా ఈవిడే మరి:
ఇక వారి మధ్యన వున్న ర్యాపో వలన రీసెంటుగా తారక్ తన తదుపరి చిత్రంలో హీరోయిన్ గా అలియాభట్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. తన 30వ చిత్రం కోసం హీరోయిన్ గా అలియానే లాక్ చేసినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక చరణ్ విషయానికొస్తే, ఓ యాడ్ లో అలియా భట్ తో కలిసి నటించాడు. దానికి సంబంధించిన వీడియో యాడ్ కూడా త్వరలో రిలీజ్ కానుంది. మరి ఇలా ఒకేసారి చరణ్-తారక్ అలియా వెంట పడుతున్న విషయం మనకి ఇట్టే అర్ధం అయిపొవట్లే!
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!