వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం షూటింగ్స్ ఏం లేని సమయంలో కూడా వారానికో సినిమా అన్నట్లు ఒకదాని తర్వాత మరొకటి తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాల కంటెంట్ సంగతి పక్కనపెడితే ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనేది ఒకటి మొదలుపెట్టి తన సినిమాలతో సక్సెస్ అవుతున్నాడు.
ఇప్పటికే వర్మ తెరకెక్కిస్తున్న సినిమాలు నాలుగైదు ప్రొడక్షన్ లో ఉండగా తాజాగా మరో సినిమాను మొదలుపెట్టాడు. అడల్ట్ సినిమాలతో రచ్చ చేస్తున్న వర్మ మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. కాకపోతే ఈసారి ఇండియన్స్ కు బాగా రేర్ జోనర్ అయిన లెస్బియన్ క్రైమ్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు డేంజరస్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసాడు. దీనికి ఒక క్యాప్షన్ కూడా తగిలించాడు. “వాళ్ళ ఎఫైర్ చాలా మందిని చంపేసింది.. పోలీసులు, గ్యాంగ్ స్టర్స్ తో సహా” అనే క్యాప్షన్ ను రివీల్ చేసాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరికాసేపట్లో విడుదల చేయనున్నాడు.