రామ్ గోపాల్ వర్మ మరో సినిమాను వదలనున్నాడు. వరసగా ఎవరినో ఒకర్ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్న వర్మ ఈసారి మొత్తం మెగా ఫామిలీను టార్గెట్ చేసాడు. తన తర్వాతి సినిమా టైటిల్ ను ‘అల్లు’ అని ప్రకటించాడు.
దానికి కారణం ఇందులో మెయిన్ క్యారెక్టర్ వివిధ రకాల ప్లాన్స్ ను అల్లుతూ ఉంటాడని వర్మ ట్వీట్ చేసాడు. అలాగే జనరాజ్యం అనే పార్టీను ఒక పెద్ద స్టార్ హీరోను స్థాపించాక ఈ సినిమా కథ మొదలవుతుందని వివరించాడు. ఒక బావ, ఒక పెద్ద స్టార్ ఫామిలీ వెనకాల ఉండి ఏమేం చేసాడు అన్నది తన సినిమాలో వివరిస్తాడట. అందరితో ‘ఆహా’ అనిపించుకోవడానికి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ “అల్లు” అని ట్వీట్ చేసాడు. అలాగే ఇందులో మెయిన్ క్యారెక్టర్లు ఆరావింద్, చిరాంజీవి, ప్రవన్ కళ్యాణ్, ఆర్జున్, శీరీష్ అని వివరించాడు వర్మ.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?