రాం గోపాల్ వర్మ ఇచ్చిన ఝలక్ కి నాగార్జున ఇంకా తేరుకోలేదా ..?

Share

రామ్‌గోపాల్‌ వర్మ వివాదాలకు కేంద్రబిందువు అన్న విషయం తెలిసిందే. రామ్‌గోపాల్‌ వర్మ ఏ సినిమా మొదలు పెట్టిన సహజంగానే ఆ చిత్రానికి ఫ్రీగా పబ్లిసిటీ వచ్చేలా చేయడంలో తనకి తానే సాటి. ఈ విషయంలో రామ్‌గోపాల్‌ వర్మ ని ఇప్పటి వరకు ఎవరూ మించలేదు. ఇక చిత్రపరిశ్రమకు వర్మ పరిచయం అయిన కొత్తలో రామ్‌గోపాల్‌ వర్మ అంటే ఉన్న క్రేజ్ ప్రస్తుతం లేదన్న మాట వినిపిస్తున్న ఆఖరి నిముషంలో వర్మ మీదే అటెన్షన్ ఉండేలా చేస్తున్నాడు. ఇక 1989లో అక్కినేని నాగార్జున ఇమేజ్‌ని మార్చిన చిత్రం శివ.

30 years for RGV, Nagarjuna, Amala's Shiva | Telugu Movie News - Times of  India

ఈ మూవీ టాలీవుడ్‌లో ఓ సంచలనం. మూస ధోరణి చిత్రాల పంథాని మార్చి రామ్‌గోపాల్‌ వర్మ అనే ఓ డేరింగ్‌ డైరెక్టర్ తెలుగు సినిమాలోకి వచ్చాడురా అనిపించింది శివ సినిమా. ఇక ఈ సినిమాతో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అలాగే చిత్రపరిశ్రమలో నాగార్జున కు ఇప్పటికి చెదరని ఇమేజ్ శివ సినిమాతో ఇచ్చాడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆ నమ్మకంతోనే వీరి కాంబోలో 2018 సంవత్సరంలో ‘ఆఫీసర్’ సినిమా వచ్చిన విషయం తెల్సిందే.

Ram Gopal Varma and Nagarjuna Officer declared a FLOP before its release!  No theater for Officer - tollywood

తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకుని ఈ మూవీకి ముందు చిన్న చితకా సినిమాలు చేస్తూ ప్లాప్ లో ఉన్న రామ్ గోపాల్ వర్మను నమ్మి నాగార్జున ఆఫీసర్ సినిమాను చేశాడు. 2018 జూన్ 1న విడుదలైన ఈ చిత్రం విమర్శకులని మెప్పించకపోవడంతో భారీ కమర్షియల్ ఫెయిల్యూర్ అయ్యింది. దీంతో మళ్లీ వర్మ పేరు తలుచుకుంటే భయం కలుగుతుందంటూ నాగ్ తన సన్నిహితుల వద్ద అన్నాడట. అంతేకాదు ఈ ఆదివారం జరిగిన బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో భాగంగా మాజీ కంటెస్టెంట్ అయిన స్వాతితో మాట్లాడుతూ గోవా వెళ్లినట్లున్నావుగా అని అనగానే అవును సార్ వర్మ గారి దర్శకత్వంలో ఒక సినిమాను చేయడానికి అంటూ చెప్పింది.

Watch: Swathi Deekshith Fires On Nagarjuna For His Comments Over Her  Elimination | The India Media

దాంతో వర్మ పేరు ఎత్తగానే గతం నాగ్ కు గుర్తకు వచ్చినట్లుంది. అందుకే కాస్త జాగ్రత్త అంటూ చిన్న సెటైర్ వేశాడు. అంతే నాగ్ నవ్వును చూసిన స్వాతితో పాటు అక్కడున్న అందరు కూడా ఆ జాగ్రత్త ఎందుకు అని ఆలోచనలో పడ్డారు. తీరా చూస్తే వర్మ నాగార్జున్ కి ఆఫీసర్ రూపంలో ఇచ్చిన ఫ్లాప్ అందుకు కారణం అని రాం గోపాల్ వర్మ ఇచ్చిన ఝలక్ నుండి నాగార్జున ఇంకా తేరుకోలేదేమో అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారట.


Share

Related posts

బ్రేకింగ్: కరోనాతో తెలుగు నిర్మాత మృతి

Muraliak

జపాన్ తో కలిసి సరికొత్త టెక్నాలజీకి తెరలేపిన ఇండియా..!!

sekhar

Trivikram : స్పీడ్ పెంచిన త్రివిక్రమ్..??

sekhar