హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్కు శ్రీకారం చుట్టారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన రామ్ గోపాల్ వర్మ అన్నట్లుగానే గురువారం సినిమా టైటిల్‌ను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.
‘టైగర్ కేసిఆర్’ సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ.. ‘ది అగ్రెసివ్ గాంధీ.. ఆడు తెలంగాణ తెస్తానంటే అందరూ నవ్విండ్రు’ అని క్యాప్షన్‌గా పేర్కొంటూ ట్వీట్ చేశారు.
ఇది కేటిఆర్ తండ్రి బయోపిక్ అనీ, ఆంధ్రపాలకుల పాలనలో తెలంగాణ ప్రజలు అణచివేతను తట్టుకోని కేసిఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించారో అనే విషయాలను చిత్రంలో చూపించబోతున్నట్లు పేర్కొన్నారు.
కేసిఆర్ తెలంగాణ పోరాటం నేపథ్యంలో ఇప్పటికే ‘ఉద్యమ సింహం’ అనే చిత్రం తెరకెక్కింది. అయితే నిర్మాత ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో విడుదల చేశారు.
రాంగోపాల్ వర్మ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.