Ram gopal varma: వెగటు పుట్టిస్తున్న ఆర్జీవీ సినిమాలు.. ఇంకా చూస్తారా..?

Share

Ram gopal varma: శివ సినిమాతో టాలీవుడ్‌లో ఓ సంచలనం సృష్ఠించిన దర్శకుడు ఆర్జీవీ..రాం గోపాల్ వర్మ. డైరెక్షన్‌లో ఎలాంటి అనుభవం లేకపోయినా కథ నరేట్ చేయడంలో కింగ్ నాగార్జునను విపరీతంగా ఇంప్రెస్ చేసి శివ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం అందుకున్నారు. ఆ సినిమాతో ఇండస్ట్రీలోని దర్శకులకు కొత్త రకమైన మేకింగ్ స్టైల్‌ను పరిచయం చేశారు. అప్పటి వరకు కట్ షాట్ అనే పద్దతి లేదు. చాలాసేపు ఒకే షాట్ అలా కంటిన్యూ అవుతూ ఉండేది. అయితే శివ సినిమాలో వర్మ కట్ టు కట్ షాట్ డివిజన్‌తో క్లోజ్ షాట్స్ ఎక్కువగా తీసి ఓ ట్రెండ్ సెట్ చేశారు.

ram-gopal-varma-latest movies are unable to impress audience
ram-gopal-varma-latest movies are unable to impress audience

అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరు దర్శకులు అదే ఫాలో అవుతున్నారు. అలా ఒకే ఒక్క సినిమా ఆయన జీవితాన్ని మార్చేసింది. అప్పటి నుంచి తెలుగులో హిందీలో డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. తెలుగు కంటే హిందీలోనే ఆర్జీవీ ఎక్కువ సినిమాలు చేశారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో సంజయ్ దత్ లాంటి వారితో మంచి రిలేషన్ ఉన్న ఆర్జీవీ సత్య, రంగీలా, సర్కార్, సర్కార్ రాజ్ లాంటి ఎన్నో సంచలనాత్మకైన సినిమాలను తీసి ముంబైలో తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. ఆర్జీవీ కంపెనీ నుంచి వచ్చిన ఎందరో ఈ రోజు ముంబైలో దర్శకులుగా, సినిమాటోగ్రాఫర్స్‌గా వెలుగుతున్నారు.

Ram gopal varma: చాలా మంది టాప్ డైరెక్టర్ ఆర్జీవీ ద్వారా ఇండస్ట్రీకి వచ్చినవారే.

తెలుగులో పూరి జగన్నాధ్, కృష్ణవంశీ, హరీశ్ శంకర్, అజయ్ భూపతి లాంటి చాలా మంది టాప్ డైరెక్టర్స్ ఆర్జీవీ ద్వారా ఇండస్ట్రీకి వచ్చినవారే. ఇక ఆయన హీరోయిన్స్‌కు ఇచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్న షార్ట్ ఫిల్మ్ తీసిన ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. ఓ బోల్డ్ ఫొటో షూట్ చేసినా చాలు. ఆ అమ్మాయి ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకొని పాపులారిటీ సంపాదించుకుంటుంది. అందుకు ఉదాహరణ అప్సర రాణి. ఇక ఓ యాంకర్ మీద కామెంట్ లేదా ట్వీట్ చేశారంటే అరియానా మాదిరిగా హైప్ వచ్చేయాల్సిందే.

వర్మ ఏం మాట్లాడినా, ఏం చేసినా సంచలనం. ఎవరి మీద ట్వీట్ చేసినా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో ఎవరికీ తెలీదు. ఎవరి మీద పాజిటివ్ కామెంట్స్ చేస్తారో..ఎవరి మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తారో ఊహించలేము. ఆయనకు గనక దేశంలో ఏదైనా బాంబ్ బ్లాస్ట్, మర్డర్ లాంటివి తగిలితే ఇక చెలరేగిపోతారు. నాలుగు రోజుల్లో కథ రాసి నలబై రోజుల్లో సినిమాను రిలీజ్ చేసేస్తారు. అంత స్పీడ్‌గా ఆర్జీవీ వాస్తవ సంఘటనల మీద సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిస్తారు. దీన్ని కూడా అందరూ ఆలోచించే కోణంలో కాకుండా మరో కోణంలో చూడటం ఆర్జీవీ స్పెషాలిటీ.

Ram gopal varma: వర్మ ఈ మధ్య జనాలు కోరుకునే సినిమాలను మాత్రం తీయడం లేదనే టాక్ వినిపిస్తోంది.

అయితే గతకొంతకాలంగా వర్మ తీస్తున్న సినిమాలు జనాలకి వెగటు పుట్టిస్తున్నాయి. ఓటీటీలలో రొమాంటిక్ సినిమాలను తీసి వదులుతున్నారు. వీటి మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న ఆర్జీవీ లైట్ తీసుకుంటున్నారు. గతంలో ఒకే మూస ధోరణిలో దెయ్యం సినిమాలు తీసి బోర్ కొట్టించిన ఆయన ఇప్పుడు అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలను తీసి చిరాకు తెప్పిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలో ఆయన ఆశ ఎన్‌కౌంటర్ అనే సినిమాతో రాబోతున్నారు. ఇక ఇటీవలే కొండా అనే ఫ్యాక్షన్ సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమాను 2022 లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. రక్త చరిత్ర లాంటి సినిమాలు తీసి హిట్స్ అందుకున్న వర్మ ఈ మధ్య జనాలు కోరుకునే సినిమాలను మాత్రం తీయడం లేదనే టాక్ వినిపిస్తోంది.


Share

Related posts

ఒక్క‌ ర‌ష్యా క‌రోనా వ్యాక్సిన్‌.. ఎన్నో సందేహాలు..!

Srikanth A

మెగాస్టార్ నుంచి ఆ… సర్‌ప్రైజ్ ..ఫ్యాన్స్ కి పూనకాలే ..!

GRK

పూజా హెగ్డే అటువంటి ట్రీట్ ఇస్తే ఏ నిర్మాతైనా వదులుతాడా ..?

GRK