Ram Gopal Varma : బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో చివరి వరకు పోరాడిన కంటెస్టెంట్ అరియనా. హౌస్ కి వారియర్ ఆఫ్ ఉమెన్ గా షో జరుగుతున్నంత కాలం ప్రేక్షకుల చేత శభాష్ అనిపించే రీతిలో గేమ్ ఆడటం జరిగింది. స్టార్టింగ్ లో కొన్ని వారాల పాటు ఇంటిలో ఉన్న టాప్ కంటెస్టెంట్ అందరికీ మెచ్చే రీతిలో అరియనా రాణించింది. కానీ ఎప్పుడైతే కెప్టెన్ అయిందో ఆమెలో ఉన్న కొత్తకోణం బయటపడటంతో చాలావరకు నెగిటివిటీ ఆమెపై పడింది. కానీ చివరిలో అరియనా ఊహించని విధంగా టాప్ కంటెస్టెంట్ లకు సైతం బీభత్సమైన పోటీ ఇచ్చి టాప్ ఫై లోకి వెళ్లడం జరిగింది. ఇదిలా ఉంటే హౌస్ నుండి బయటకు వచ్చిన అరియనా ఒక పక్క సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ మరోపక్క గతంలో మాదిరిగా తన కెరియర్ కొనసాగిస్తోంది.
Ram Gopal Varma గోవా ఆఫీస్ లో రామ్ గోపాల్ వర్మ తో :-
ఇదిలా ఉంటే తాజాగా గోవాకి టాప్ యాంకర్ లు శ్రీముఖి, విష్ణుప్రియ వెళ్ళిన క్రమంలో వారితోపాటు ఏమి కూడా వెళ్ళటం రచ్చ రచ్చ చేయడం అందరికీ తెలిసిందే. గత నాలుగు రోజులుగా గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను వీళ్లంతా కలిసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కుర్రకారు గుండెలను హీటెక్కిస్తున్నరు. ఇదిలా ఉంటే బిగ్బాస్ హౌస్ కి వెళ్లక ముందు అంటగా పాపులారిటీ లేని అరియనా కి ఎప్పుడైతే రాంగోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది, రామ్ గోపాల్ వర్మ అరియనా పై వేసిన చిన్న డైలాగ్ కి ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ వల్లనే అరియనా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో గోవాలో ఆర్జివి తో అరియనా సమావేశం అవ్వడం జరిగింది. ఆయన ఆఫీసులో కలిసిన అరియనా .. ఆయనతో పాటు దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తనకోసం సమయం కేటాయించినందుకు ఆర్జీవీకి కృతజ్ఞతలు తెలిపింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో అరియానా కి తనవంతుగా సోషల్ మీడియాలో అప్పట్లో రామ్ గోపాల్ వర్మ సపోర్ట్ చేయటం మాత్రమే కాక.. అరియానా హౌస్ లో ఆడుతున్న తీరుపై ప్రశంసల వర్షం కురిపించటం పెరిగింది. ఇటువంటి తరుణంలో ఆమెతో ఆర్జీవి కలిసి ఫోటో దిగడం తో… ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది