Ram : రామ్ – ఇలియానా జంట మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయనున్నారా.. అంటే ఆ అవకాశం ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు సినీ వర్గాలు. రామ్ – ఇలియానా జంటగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. రామ్ – ఇలియానా డెబ్యూ సినిమా అయిన దేవదాసు మ్యూజికల్‌గా కూడా పెద్ద సక్సస్ సాధించింది. పార్వతి-దేవదాసు లవ్ స్టోరికి ఎంత గొప్ప ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ బ్యాక్ డ్రాప్లో వచ్చిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.
ఇదే టైటిల్ తో రామ్ – ఇలియానా నటించిన దేవదాసు సినిమాకి అంతే పేరు వచ్చింది. యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాతో ఇద్దరు స్టార్స్ అయిపోయారు. ఈ సినిమా తర్వాత ఇలియానా పోకిరి సినిమా చేసింది. ఈ సినిమా 75 ఏళ్ళ ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేయడం విశేషం. ఈ రెండు సినిమాల తర్వాత ఇలియానా ఇక కెరీరి లో వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరసగా పెద్ద బ్యానర్లు.. స్టార్ హీరోలతో సినిమాలు చేసి భారీ సక్సస్లను తన ఖాతాలో వేసుకుంది.
Ram : ఇలియానా కొన్నేళ్ళ తర్వాత అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఉన్నపలంగా టాలీవుడ్లో కనుమరుగైపోయింది ఇలియానా. కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికి ఈ సినిమా ఫ్లాప్ గా మిగలడంతో మళ్ళీ కనిపించలేదు. అయితే రీసెంట్గా తన డెబ్యూ హీరో రామ్ తో కలిసి దిగిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోతో అందరు మళ్ళీ పారూ – దేవదాస్ కలిసి స్క్రీన్ మీద కనిపించబోతున్నారా అని మాట్లాడుకుంటున్నారు. చెప్పలేము.. ఆ అవకాశం ఉన్నా ఉండొచ్చునన్న మాట కూడా వినిపిస్తోంది.