ప్రపంచంలో కరోనా మొదలైనప్పటి నుండి ప్రజలకు గానీ సినిమా ప్రేక్షకులకు గానీ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కరువైంది. పరిస్దితులన్ని ఎప్పటిలా ఉంటే ఈ సమయానికి ఎన్ని సినిమాలు సంక్రాతి బరిలో నువ్వా – నేనా అని పోటిపడేవి. అంతేకాదు సంక్రాంతి అనేది పెద్ద పండుగ కాబట్టి కొందరు టాలీవుడ్ హీరోలకైతే సెంటిమెంట్. కానీ ఈ కోవిడ్ వల్ల ఆ సెంటిమెంట్ ఈసారి అంతగా వర్కౌట్ కావడం లేదు. ఈసారి సంక్రాంతి సీజన్ లో భారి సినిమాలేవి బరిలో దిగడం లేదు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం రిలీజ్కు రెడిగా ఉన్న మీడియం బడ్జెట్ సినిమాలు పరిస్దితులన్ని బాగుంటే సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదం అందించడానికి సిద్దం అవుతున్నాయట.
అందులో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ చిత్రం కూడా ఉంది. అయితే హీరో రామ్ కు ఈ సంక్రాంతి పండుగ ఎంతగా కలిసి వస్తుందో చూడాలి. గతంలో రామ్ నటించిన సినిమాలు కొన్ని సంక్రాంతి సీజన్ లో వచ్చి హిట్ అందుకుంటే కొన్ని సినిమాలు ఫ్లాపయ్యాయి. రామ్ హీరోగా నటించిన డెబ్యూ సినిమా దేవదాసు సంక్రాంతికి రిలీజ్ చేయగా పెద్ద హిట్టయిందన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మస్కా అనే సినిమాని రిలీజ్ చేస్తే సినిమా ఫ్లాప్ గా నిలించింది. దీంతో కొన్నేళ్లుగా ఈ సీజన్ కు దూరంగా ఉంటున్న రామ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రెడ్ సినిమాతో సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
కాగా మాస్ ఎంటర్ టైనర్గా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ భారీ కమర్షియల్ హిట్ గా సెన్షేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అదే ఊపులో ఉన్న ఈ ఎనర్జిటిక్ హీరో మరో భారీ హిట్ కోసమే ఇన్నాళ్ళు ఆగి ప్రస్తుతం సంక్రాంతి బరిలోకి వస్తున్నాడు. అందులో ఈ మధ్య కాలంలో కరోనా వల్ల ఎక్కడి షూటింగ్స్ అక్కడే ఆగిపోయాయి. ఈ నేపథ్యం లో రామ్ నెక్స్ట్ సినిమా కూడా ఇంకా కంఫర్మ్ కాలేదు. భారీ అంచనాలున్న రెడ్ సినిమా మీద రామ్ ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నాడు. మరి సంక్రాంతి బరిలో దిగబోతున్న రవితేజ క్రాక్.. రానా దగ్గుబాటి అరణ్య సినిమాలతో పోటీ కి దిగి ఈ సంక్రాంతి సీజన్ లో హిట్ గా నిలుస్తుందా లేదా చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?