Ram pothineni : రామ్ పోతినేని ప్రస్తుతం ఎన్.లింగు స్వామి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఊహించని విధంగా మాస్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ పోతినేని నెక్స్ట్ సినిమా కూడా మాస్ ఎలిమెంట్స్ ఉన్నదే చేసి హిట్ కొట్టాడు. రెడ్ సినిమాలో డ్యూయల్ రోల్ పోషించిన రామ్ పోతినేనిని బ్యాక్ టు బ్యాక్ రెండు మాస్ హిట్స్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే మరో సినిమా కూడా ఇన్లు స్వామితో చేస్తున్నాడు.
తాజాగా రామ్ పోతినేని నెక్స్ట్ సినిమాకి కూడా డైరెక్టర్ ఫిక్సయ్యాడట. టాలీవుడ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ గురించి ఇన్నాళ్ళు ఎవరికీ పెద్దగా తెలీదు. అప్పుడెప్పుడో పిట్టగోడ అనే సినిమా తీశాడు. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా ఎవరికీ గుర్తు లేదు. అయితే ఇటీవల వచ్చిన జాతి రత్నాలు సినిమాతో అనుదీప్ కేవీ దర్శకుడిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. స్వప్న సినిమా నిర్మాణ సంస్థలో దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగానే కాకుండా అమెరికాలో కూడా వసూళ్ళ సునామీని సృష్ఠించింది.
Ram pothineni : రామ్ పోతినేని – అనుదీప్ కేవీ కాంబినేషన్ లో సినిమా త్వరలోనే..?
దాంతో అనుదీప్ కేవీ బాగా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో మరో సినిమా కూడా స్వప్న సినిమా బ్యానర్ లోనే చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. రెండు కథలు సిద్దం చేస్తున్న అనుదీప్ కేవీ ఒక కథ రామ్ పోతినేని తో చేయబోతున్నాడట. ఈ సినిమాని స్వప్న సినిమా నిర్మించబోతున్నారట. ఇక మరో సినిమాని జాతి రత్నాలు సినిమాలో కీలక పాత్ర పోషించి విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి తో చేయబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టికి టాలీవుడ్ లో బాగా క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రామ్ పోతినేని – అనుదీప్ కేవీ కాంబినేషన్ లో సినిమా త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది.