NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పిలిచి జ‌గ‌న్ ఎమ్మెల్యే సీటిస్తే రాం రాం అంటోన్న కృష్ణా వైసీపీ లీడ‌ర్‌..?

సాధారణంగా ఎవరైనా ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అనుకుంటే ఎగిరి గంతేస్తారు.. అంతకు మించిన ఆనందం ఇంకేం ఉండదు. అందులోను ప్రధాన పార్టీల నుంచి ఎమ్మెల్యే సీటు వచ్చింది అంటే జీవితానికి ఇంకేం అవసరం లేదు అనుకుంటారు. అయితే కృష్ణా జిల్లాలో ఒక లీడర్ మాత్రం వైసిపి అధినేత జగన్ పిలిచి మరి అసెంబ్లీ సీటు ఇచ్చినా పోటీ చేసేందుకు ఆసక్తితో లేనట్టు తెలుస్తోంది. ఆ నేత ఎవరో కాదు అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్. వీరిది బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. గతంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన సింహాద్రి సత్యనారాయణ తనయుడే సింహాద్రి చంద్రశేఖర్.

ఆయన హైదరాబాదులో క్యాన్సర్ వైద్య నిపుణుడిగా పని చేస్తున్నారు నెల రోజుల క్రితం జగన్ ప్రస్తుతం అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ బాబును బందరు పార్లమెంటుకు సమన్వయకర్తగా నియమిస్తూ అదే ప్లేస్ లోకి సింహాద్రి చంద్రశేఖర్ ను తీసుకువచ్చారు. ఆయనకు ఇన్చార్జి పగ్గాలు ఇచ్చి నెలరోజులు దాటుతున్న నియోజకవర్గం వైపు కన్నితి చూడలేదు. అయితే తనకు వయసు పైబ‌డటంతో తాను పోటీ చేయలేనని.. తనకు బదులుగా తన కుమారుడు న్యాయవాది రామ్ చరణ్ ను సమన్వయకర్తగా నియమించాలని జగన్‌ను కోరారు. దీనికి జగన్ కూడా అంగీకరించారు.. కొద్ది రోజులలోనే అవనిగడ్డ నుంచి పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని చెప్పిన చంద్రశేఖర్ ఇప్పటివరకు అసలు అవనిగడ్డ వైపు చూడలేదు.

మరోవైపు ఎన్నికల వేడి రాజుకుంది.. ఇలాంటి టైంలో కూడా నెల రోజుల క్రితం సమన్వ‌యకర్తగా ఎంపికయి ఇప్పటివరకు నియోజకవర్గంలోకి అడుగుపెట్టకపోవడంతో సింహాద్రి చంద్రశేఖర్ ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆసక్తితో లేరని తెలుస్తోంది. అయితే స్థానిక నేతలను కలిశాక వారి నుంచి సానుకూల స్పందన లేకపోవడం కనీసం ఫోన్ కు కూడా స్పందించకపోవడంతో వారంతా సహాయ నిరాకరణ చేస్తున్నారన్న ఆవేదనతోనే డాక్టర్ చంద్రశేఖర్ తన కుమారుడని అవనిగడ్డ బరిలో దింపాలన్న ఆలోచన విరమించుకోవాలనుకున్న‌ట్టుగా ప్రచారం జోరుగా సాగుతోంది.

అవనిగడ్డ సమన్వయకర్తగా నియమితులైన డాక్టర్ చంద్రశేఖర వెనక్కి తగ్గడంతో ఇప్పుడు అవనిగడ్డలో వైసీపీ నుంచి ఎవరు ? పోటీ చేస్తారు అన్న సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ బాబుని మళ్ళీ అక్కడ పోటీలోకి దింపుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక బందరు పార్లమెంటు నుంచి మాజీ ఎంపీ బాడిగ‌ రామకృష్ణ కుమార్తె పేరు తెరమీదకు వస్తోంది. ఏది ఏమైనా జగన్ పిలిచి మరి ఎంపీ సీటు ఇచ్చినా పోటీ చేయనని ఎస్కేప్ అవుతున్నారు అంటే అవ‌నిగ‌డ్డ‌ వైసీపీలో అంత సానుకూల వాతావరణం లేదన్న చర్చ నడుస్తోంది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju