Subscribe for notification

రామ్ ‘రెడ్’ ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారో చూడండి ..?

Share

రామ్ ‘రెడ్’ .. ఇస్మార్ట్ శంకర్ తర్వాత భారీ అంచనాలతో రిలీజ్ కావాల్సిన red సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. కాగా ఎట్టకేలకి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా తో పోటీ అనుకున్న రెండు సినిమాలు ram ‘red’ నుంచి అడ్డు తప్పుకున్నాయి. వాటిలో రవితేజ క్రాక్ సినిమా 5 రోజుల ముందే రిలీజ్ అవుతోంది. ఇక రానా అరణ్య మార్చ్ నెలలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. దాంతో ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ram ‘red’ ఒక్కటే సందడి చేయబోతోంది.

ఇక ఈ సినిమా తమిళ హిట్ సూపర్ మూవీ ‘తడమ్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. రామ్ ఇమేజ్ కి తగ్గట్టు ఒరిజినల్ వర్షన్ కంటే తెలుగులో చాలానే మార్పులు చేర్పులు చేశారట. ram పేదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మాతగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కింది. మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించారు. యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది. ఇక ram ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతుండగా ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాలను పెంచి మరో మాస్ హిట్ ఇవ్వబోతుందన్న నమ్మకాన్ని కలిగించింది.

కాగా ఈ అంచనాలకి తగ్గట్టుగా ram red సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా మరో 6 భాషల్లోను రిలీజ్ చేయబోతున్నారు. కన్నడ, మలయాళ, హిందీ భోజ్ పురి బెంగాళీ మరాఠి భాషల్లోకి డబ్బింగ్ చేశారట. ఇప్పటికే అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. మన టాలీవుడ్ హీరోలకి మిగతా భాషల్లో కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే మన స్టార్ హీరోలు నటించిన సినిమాలు మిగతా భాషల్లో కూడా డబ్బింగ్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ram red సినిమాని పలు భాషల్లో రిలీజ్ చేయబోతున్నాడు. చూడాలి మరి ఈ సినిమా ram కి ఎలాంటి సక్సస్ ని ఇస్తుందో.


Share
GRK

Recent Posts

Virata Parvam-Vikram: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `విక్ర‌మ్‌`, `విరాట ప‌ర్వం`..ఇవిగో స్ట్రీమింగ్ డేట్స్‌!

Virata Parvam-Vikram: క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీల హ‌వా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో…

32 mins ago

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

2 hours ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

2 hours ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

2 hours ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

3 hours ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

3 hours ago