NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

Telangana Congress: తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలకు నామినేషన్ల గడువు ముగియడానికి ఒక రోజు ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి పేరుని ప్రకటించింది. కరీంనగర్ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావు, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మహ్మద్ వలీవుల్లా సమీర్ పేర్లను ప్రకటించింది.

ఏవరీ రఘురామిరెడ్డి ..?

ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిత్వానికి ముగ్గురు మంత్రులు తమ బంధువుల కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ అభ్యర్ధి ఎవరు అవుతారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులకు కాకుండా మరో నేత తెరపైకి రావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే ఈ రఘురామిరెడ్డి ఎవరు అంటే .. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు. అంతే కాకుండా తెలుగు సినీ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా ఈయన వియ్యంకుడు. ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని ఆనుకొని ఉన్న మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి రఘురామి రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. దీంతో ఆయనకు రాజకీయ పరపతి బాగానే ఉంది.

ఆర్థికంగా ఆయన బలవంతుడే కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయన వైపు మొగ్గు చూపిందని టాక్. ఒక పక్క మంత్రి పొంగులేటి సోదరుడు, మరో పక్క డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ఇలా ముగ్గురు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొదరుడు ప్రసాద్ రెడ్డి డ్రాప్ అయ్యారు. తన సోదరుడికి కాకుంటే వియ్యంకుడు రఘురామి రెడ్డికి టికెట్ ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రయత్నం చేశారనే టాక్ నడుస్తొంది.

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N