టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య – సమంత గురించిన గాసిప్స్ ఆగడంలేదు. వీరు విడిపోయి సంవత్సరం కావస్తున్నా.. ఇంకా పుకార్లు షికారు చేయడం కాస్త బాధాకరమే. ఏం చేస్తాం.. సినిమా తారలంటే అందరికీ అలుసే మరి. విడిపోవడం, కలిసుండటం వారి వ్యక్తిగత అంశం అయినప్పటికీ తెలిసి కూడా ఈ మీడియావాళ్లు వాళ్ళు ఎక్కడ కనబడినా అదే విషయం మీద కెలుకుతూ వుంటారు. నిన్న మొన్నటి వరకు వారు కాస్త ఓపిక వహించారు కానీ, తాజా ఇంటర్వ్యూలలో మాత్రం బరస్ట్ అయిపోతున్నారు. గతంలో చూసుకుంటే నాగ చైతన్య గురించి మీడియాలో వార్తలు రావడం చాలా అరుదు. కానీ ఇప్పుడు అలా కాదు!
ముఖ్యంగా సమంత కాఫీ విత్ కరణ్ షో లో చేసిన కామెంట్స్ తరువాత.. నాగ చైతన్య కూడా ఏ మాత్రం తగ్గకుండా తన పర్సనల్ విషయాలను మీడియాతో వీలైనన్ని షేర్ చేసుకుంటున్నాడు. లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో భాగంగా.. పలు ఇంటర్వ్యులు ఇచ్చిన ఆయన.. సినిమా రిలీజ్ అయ్యాక కూడా పాజిటీవ్ వైబ్స్ కోసం వరుస ఇంటర్వ్యులు ఇస్తూనే వున్నాడు. తాజా ఇంటర్వ్యులో ఆయన సంచలన విషయాలను బయట పెట్టడం కొసమెరుపు.
సదరు యాంకర్ ‘మీకు ఏ హీరోయిన్ తో వర్క్ చేయాలని ఉంది?’ అని అడగ్గా చైతన్య స్పందిస్తూ… “కత్రినా కైఫ్, అలియా భట్, దీపికా పదుకునే.. ఇంకా ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. కానీ, నాకు అలియా యాక్టింగ్ అంటే మహా ఇష్టం. ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే అస్సలు వదులుకోను. దేవుడి దయవలన అలాంటి ఆఫర్ వస్తే గనుక ఖచ్చితంగా తనతో రొమాన్స్ చేస్తా. ఎట్టి పరిస్ధితుల్లోను మిస్ చేసుకోను!” అంటూ ఓ ఘాటైన ఆన్సర్ ఇచ్చాడు. ఇక ఈ విషయం ఆనోటా ఈనోటా చేరి కడకు సమంతకు చేరిందట… దాంతో ఆమె చేపై గుర్రుగా ఉందని భోగట్టా.