Ramdev Baba Vs IMA : ఐఎంఏ వర్సెస్ రాందేవ్! బ్లాక్ డే పాటించిన వైద్యులు!వాట్ నెక్స్ట్??

Share

Ramdev Baba Vs IMA : అల్లోపతి వైద్యం మీద ఆ కోవకు చెందే డాక్టర్ల పైన యోగా గురు బాబా రామ్దేవ్ కించపర్చే వ్యాఖ్యలు చేస్తున్న నేపధ్యంలో ఇందుకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు మంగళవారం నాడు వైద్యులందరూ బ్లాక్ డేపాటించారు. యోగా గురు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని’ అది జరగని పక్షంలో పోలీసులు ఆయనపై దేశద్రోహం నేరం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

 Ramdev Baba Vs IMA Continues
Ramdev Baba Vs IMA Continues

చివరకు కరోనా వ్యాఖ్యలు కూడా వృథా అంటూ రాందేవ్ చేసిన వ్యాఖ్యల కారణంగా ప్రజలు వ్యాక్సినేషన్ కి దూరంగా ఉంటున్నారని ఐఎంఎ పేర్కొంది.ముఖ్యంగా ఈ బ్లాక్ డే ప్రభావం ఢిల్లీలో ఎక్కువగా కనిపించింది.దిల్లీ లోని ప్రముఖ హాస్పిటల్ సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో వైద్యుల నిరసన తారాస్థాయికి చేరింది.నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ప్లకార్డులు ధరించి వైద్యులు యోగా గురు రామ్దేవ్ అరెస్టుకు డిమాండ్ చేస్తూ నినాదాలు హోరెత్తించారు.అయితే అదే సమయంలో వారెవరూ కరోనా విధులకు గైర్హాజరు కాలేదు.కొందరు డాక్టర్లయితే పిపిఈ కిట్లు ధరించి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు

Ramdev Baba Vs IMA: రామ్ దేవ్ కు ఆ అర్హత లేదు!

అల్లోపతి వైద్యాన్ని, ఆ కోవకు చెందిన వైద్యులు ను విమర్శించే అర్హత యోగా గురు రాందేవ్ కు లేదని నాయకులు పేర్కొన్నారు.వైద్యానికి సంబంధించి రామ్ దేవ్ అర్హతలు ఏమిటని వారు ప్రశ్నించారు. “ఇష్టానుసారం మాట్లాడి అల్లోపతి వైద్యాన్ని ఇంగ్లీషు డాక్టర్లను విమర్శించడం ద్వారా మా మానసిక స్థైర్యాన్ని ఆయన దెబ్బతీశారు.ప్రజల్లో లేనిపోని అపోహలు రేపారు.ఈ కారణంగా దేశంలో అశాంతి రేగే ప్రమాదం కూడా లేకపోలేదు.కాబట్టి తక్షణమే దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రామ్ దేవ్ పై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని వారు పేర్కొన్నారు.ప్రధాని నరేంద్రమోడీ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కరోనా దేశాన్ని కమ్మేసిన తరుణంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యులు సేవలు అందిస్తుంటే వారిపై విమర్శలు ఆరోపణలు చేశాయి రాందేవ్ ను ఉపేక్షించటం సరికాదని వారు పేర్కొన్నారు.ప్రధాని స్పందన కోసం మరికొన్ని రోజులు వేచి చూద్దామని తదుపరి తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించారు.

Read More: Ys Jagan: వ్యాక్సిన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్..!!

ఐఎమ్ఎ నోటీసు అందిందట!

ఇదిలా ఉండగా అల్లోపతి వైద్యులపై రామ్ దేవ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఐఎంఏ ఆయనకు లీగల్ నోటీసు పంపింది.తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోని పక్షంలో ఆయన మీద వెయ్యి కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఆ నోటీసులో పేర్కొంది.కాగా ఆ నోటీసు అందిందని పతంజలి ట్రస్ట్ తెలిపింది.తగిన విధంగా తాము కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి సమాధానం ఇస్తామని వెల్లడించింది.

 


Share

Related posts

అన్నీ బాగున్నాయి.. నాన్నతో ఆమాట చెప్పించు లోకేష్!

CMR

మద్యపాన నిషేధానికి మరో ముందడుగు వేసిన ఏపీ ప్రభుత్వం

Siva Prasad

సన్నిహితులు ఎంత అడుగుతున్నా, మీడియా నిలదీస్తున్న, చంద్రబాబు నోట్లోనుంచి ఆ మాట మాత్రం బయటకు రావటం లేదు..??

sekhar