Ramdev Baba: రాజీకొచ్చిన రాందేవ్!అల్లోపతి వైద్యుల మీద వ్యాఖ్యలు ఉపసంహరణ!ఐఎంఎ ఇంతటితో యోగాగురును వదిలేనా?

Share

Ramdev Baba: అల్లోపతి వైద్యం, ఆ కేటగిరీకి చెందిన వైద్యులపై తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దీనిని సీరియస్ గా తీసుకోవడం, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో యోగా గురు బాబా రాందేవ్ రాజీ మార్గం అవలంభించారు.తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన ప్రకటించడమే కాకుండా ఇంతటి వివాదానికి కారకుడినైనందుకు బాబా రాందేవ్ విచారం కూడా వెలిబుచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు.

Ramdev Baba Withdrawal of comments on allopathy doctors
Ramdev Baba Withdrawal of comments on allopathy doctors

పూర్వాపరాలేమిటంటే!

బాబా రాందేవ్‌ ఆధునిక వైద్యశాస్త్రాన్ని, వైద్య విధానాలను అవమానించే విధంగా మాట్లాడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది .అందులో అల్లోపతి వైద్యాన్ని రాందేవ్ అవహేళన చేశారు.అల్లోపతి అనేది ఒక పనికిరాని సైన్స్ అంటూ రాందేవ్ వ్యాఖ్యానించారు.అల్లోపతి మందులు తీసుకున్న లక్షలాది మంది కోవిద్ రోగులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.భారత డ్రగ్ కంట్రోలర్ ఆమోదించిన రెమిడిసీవర్,ఫావి ఫ్లూ వంటి మందులు కూడా కూడా కరోనాను నయం చేయలేకపోయాయని రాందేవ్ అన్నారు.అంతకుముందు మరో సందర్భంలో రాందేవ్ వైద్యులనుద్దేశించి ఆధునిక హంతకులని వ్యాఖ్యానించారు.దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భగ్గుమనడం తెలిసిందే.ఇష్టానుసారం మాట్లాడిన బాబా రామ్ దేవ్ పై అంటువ్యాధుల చట్టం కింద చర్యలు తీసుకొని ప్రాసిక్యూట్ చేయాలని ఐఎంఎ డిమాండ్ చేసింది .లేకుంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించింది. మరోవైపు జలంధర్ పోలీసులకు కూడా ఐఎంఎ ప్రతినిధి ఒకరు రామ్ దేవ్ పై ఫిర్యాదు చేయడం జరిగింది.

రంగ ప్రవేశం చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి!

అల్లోపతి మీద,ఆ క్యాటగిరీ వైద్యుల మీద యోగా గురు బాబా రాందేవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఐఎంఎ ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు కేంద్రం స్పందించింది.అయితే కట్టె విరక్కుండా పాము చావకుండా అన్న ధోరణిని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ బీజేపీకి అనుకూలంగాఉండే రాందేవ్ విషయంలో ప్రదర్శించారు.బాబా రాందేవ్ ను తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాల్సిందిగా లేఖ రాశాను.ఆయన స్పందన కోసం ఎదురుచూస్తున్నా..అంటూ కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆదివారం ట్వీట్ చేశారు.కచ్చితంగా బాబా రాందేవ్ వ్యాఖ్యలు అల్లోపతి వైద్య రంగాన్ని కించపరిచేవిగా ఉన్నాయని మాత్రం ఆయన అంగీకరించారు.ఇంగ్లీషు మందుల వల్ల కరోనా రోగులు వేలసంఖ్యలో చనిపోతున్నారని రామ్దేవ్ అనడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. ఐఎంఏ ఆవేదనతో తాను ఏకీభవిస్తున్నానని మంత్రి తెలిపారు.

Ramdev Baba: ఆ కాసేపటికే స్పందించిన రామ్ దేవ్!

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే రాందేవ్ తాను తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.”కేంద్రమంత్రి పంపిన లేఖ అందింది .నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. ఇందువల్ల తలెత్తిన వివాదం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను” అని రాందేవ్ తెలిపారు.అయితే ఐఎంఎ ఇంతటితో సంతృప్తి చెందుతుందా లేదా అన్నది చూడాలి!

 


Share

Related posts

జగన్ డిల్లీ టూర్ క్యాన్సిల్ అయినా  కానీ… శుభవార్త అందింది 

siddhu

Tirath Singh Rawat : రేషన్ ఎక్కువ కావాలంటే ఏం చెయ్యాలో సలహా ఇచ్చిన నోటితీట సీఎం తీరత్ సింగ్! రాజుకున్న మరో వివాదం!

Yandamuri

Digestive Biscuits: డైజెస్టీవ్ బిస్కెట్ లు ఆరోగ్యకరమైనవి అనుకుంటే పొరపాటే!!

Naina