సీఎం రమేష్ ఉక్కు సంకల్పం నేరవెరనుంది

కడపలో ఉక్కు పరిశ్రమకు పునాదిరాయి వేసే వరకు గడ్డం తీయబోనంటూ దీక్షబూనిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌ గురువారం తన దీక్ష విరమించనున్నట్లు ఆయన తెలిపారు. పునాదిరాయి కార్యక్రమం పూర్తయ్యాక తిరుమల చేరుకుని స్వామికి తలనీలాలు సమర్పించడంతో పాటు గడ్డం తొలగిస్తానని సీఎం రమేష్ తెలిపారు.