దగ్గుపాటి రానా.. మల్టీ స్టార్ గా మంచి పేరున్న హీరో. బహుబలి సినిమాతో బళ్లాల దేవగా అందరికీ తెలుసు. అయితే ఆయన కేవలం హీరోగానే కాకుండా నెం 1 యారీ కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటాడు. మరోవైపు ఫిల్మ్ స్కూల్ నడుపుతూ.. సినిమాలను నిర్మాణం చేస్తుంటారు. ఇప్పుడు ఇవేవి చాలనట్టు ఆయన మరో వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి సిద్దమయ్యాడు ఈ హీరో.
దీంతో పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే ఇంత బిజీ హీరో కూడా ఇన్ని పనులు ఎలా చేస్తారని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇంతకీ ఏ వ్యాపారమో చెప్పలేదు కదా.. రానా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని సోమవారం ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ యూట్యూబ్ ఛానెల్ లో మల్టీ లాంగ్వేజ్ కంటెంట్ ను అందించనున్నట్లు తెలుపుతున్నారు.
కొత్త ప్రతిభను ఎంకరేజ్ చేయడానికి ఈ ఛానెల్ ను స్టార్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఛానెల్ లో పది సెకన్ల నుంచి పది గంటల వరకు కథలను చెప్పబోతున్నట్లు తెలిపారు. ఇందులో కేవలం స్టోరీలు మాత్రమే కాదు, మ్యూజిక్, షార్ట్ ఫామ్, న్యూస్, యానిమేషన్, ఫిక్షన్ అంశాలు కూడా పొందు పర్చే అవకాశమున్నట్లు తెలిపారు. ఈ ఛానెల్ విషయాన్ని రానాతోపాటు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ కూడా ట్వీట్ ద్వారా తెలిపాడు.
లాక్‌డౌన్ తర్వాత డిజిటల్ కు ఆదరణ చాలా పెరిగింది. దీంతో రానా ఈ యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పలువురిని బాగా ఆకర్శిస్తోంది. రానా ఇప్పుడు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. హరణ్య`, హిరణ్య కశ్యప, విరాటపర్వం సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. ఇంకోవైపు బాబాయ్ వెంకీతో కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
Avneet Kaur: అంకుల్ తో ఎందుకు నటించారంటే, ఏజ్ గ్యాప్ గురించి అమ్మడు ఎలా క్లాస్ పీకిందో తెలుసా!