Bheemlaa nayak: సంక్రాంతి బరిలో దిగుతున్న మూడు భారీ చిత్రాలలో భీమ్లా నాయక్ ఒకటి. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన అయ్యప్పనుమ్ కొషియుమ్ కి అఫీషియల్ రీమేక్‌గా భీమ్లా నాయక్ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రం అందిస్తుండటంతో ప్రాజెక్ట్ మీద అంచనాలు బాగానే మొదలయ్యాయి. ఇక ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలు అంటే ఆ ప్రాజెక్ట్ మీద అంచనాలు ఏ రేంజ్‌కి చేరుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే చిత్రబృందం టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ప్రతీ అప్‌డేట్‌తో ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉన్నారు. దానికి తోడు మ్యూజిక్ సెన్షేషన్ థమన్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఆ రేంజ్‌ను అలా అలా పెంచుతూ వస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర మేకింగ్ పవన్ కళ్యాణ్ – రానాల పర్ఫార్మెన్స్, త్రివిక్రం శ్రీనివాస్ డైలాగ్స్ ..ఇలా ప్రతీది భీమ్లా నాయక్ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా హీరో రానా దగ్గుబాటి బర్త్ డే సందర్భంగా డానియేల్ శేఖర్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది.
Bheemlaa nayak: సంక్రాంతి బరిలో భారీ కమర్షియల్ సక్సెస్ అందుకోవడం గ్యారెంటీ..
పవన్ కళ్యాణ్ పోషిస్తున్న భీమ్లా నాయక్ పాత్రకు రానా పోషిస్తున్న డానియేల్ శేఖర్ పాత్ర ఎంత ధీటుగా ఉంటుందో మరోసారి తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌తో క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు స్టార్ హీరోలు పోటాపోటీగా నటిస్తున్న భీమ్లా నాయక్ సంక్రాంతి బరిలో భారీ కమర్షియల్ సక్సెస్ అందుకోవడం గ్యారెంటీ అని మరోసారి చిత్రబృందం ఆసక్తిని మరో లెవల్‌లో పెంచేసి చూపించింది. ఇక ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ పాత్రలు భీమ్లా నాయక్ సినిమాకు మరో హైలెట్‌గా నిలవనున్నాయి. ఇక ఈ సినిమాను ఎపుడెప్పుడు థియేటర్స్‌లో చూస్తామా అని మెగా అభిమానులే కాదు ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.