Ranabeer-aliya : స్టార్ హీరో రన్బీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్ ఇద్దరు ఒక్కటి కాబోతున్నారు. కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ స్టార్ జంట నేడు దంపతులుగా మారనున్నారు. గురువారం ఉదయం నుంచే ఇద్దరు స్టార్స్ కుటుంబ సభ్యులు, స్నేహితులు వివాహ వేడుక వేదిక వద్దకు చేరుకోవడం స్టార్ట్ చేశారు. బుధవారం ఫ్రీ వెడ్డింగ్, మెహందీ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Ranabeer-aliya: గిఫ్ట్ గా వజ్రాలతో పొదిగిన బ్యాండ్..
కాగా, ఆలియా కోసం రణబీర్ 8 వజ్రాలతో పొదిగిన ఖరీదైన వెడ్డింగ్ బ్యాండ్ ని బహుమతిగా ఇచ్చినట్టు సమాచారం. వివాహంలో ఆలియా తన చేతికి ఆ బ్యాండ్ ధరించనున్నారు. కాగా రణబీర్ కపూర్ ఇంటి కుటుంబానికి 8 లక్కీ నంబర్ అట. అందుకే కాబోయే శ్రీమతికి ఎనిమిది వ్రజాలు పొదిగిన బ్యాండ్‌ని రణ్‌బీర్ బహూకరించి ఉంటారు.
మూడు భాగాలుగా బ్రహ్మాస్త్ర..
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ‘బ్రహ్మాస్త్ర’ విజన్‌ను దర్శకధీరుడు రాజమౌలి అందిస్తున్నారు. మూడు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుంది.