Rang De Trailer review : నితిన్ హీరోగా, జాతీయ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘

Rang De Trailer review : ట్రైలర్ రివ్యూ
‘రంగ్ దే‘ చిత్రంలో తన అన్నీ సినిమాల క్యారెక్టర్ల లాగానే నితిన్ అల్లరి చిల్లర చలాకి కుర్రాడిగా కనిపిస్తాడు. చిన్నప్పటి నుండి అతని ఇంటి పక్కనే ఉన్న కీర్తి సురేష్ ఎప్పుడు చూసినా అతనిని తన ఇంట్లో వారితో తెట్టించేది. నితిన్ తండ్రి నరేష్ తో మెప్పు పొందుతూ అదే క్రమంలో నితిన్ ని తిట్టించే కీర్తి సురేష్ పైన పీకల్లోతు కోపం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఆమెకి ఏదైనా ఆపద కూడా తెలియకుండానే కాపాడుతుంటాడు. అయినప్పటికీ ఇద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. ఇలాంటి సమయంలో అనుకోని సందర్భాల్లో వీరిద్దరూ శారీరకంగా ఒకసారి దగ్గరవుతారు. ఈ విషయం రెండిళ్ళలో తెలిసి ఇద్దరినీ హౌస్ అరెస్ట్ చేస్తారు. చివరికి అనేక పరిణామాలు చోటుచేసుకుని వీరిద్దరికీ ఇంట్లో వారే పెళ్లి చేస్తారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు కానీ ఇలా అనూహ్యంగా పెళ్లి జరగడంతో వారి లైఫ్ టర్న్ ఎలా అయింది? చివరికి వీరిలో ఎవరికి ఎవరి మీద ప్రేమ పుట్టింది? దాని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు…? చివరికి ఒకటయ్యారా లేదా అనేదే కథ అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
ఇవి వర్కౌట్ అవుతాయేమో…
- ట్రైలర్లో నితిన్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఈ రకమైన పాత్రల్లో నటించడం లో అతను ఆరితేరిపోయాడు. ఇది సినిమాకి భారీ ప్లస్ అవుతుంది.
- తెలుగులో కీర్తి సురేష్ ఇంత చలాకి పాత్ర చేయలేదు. స్క్రీన్ పైన ఆమె ఉన్న ప్రతి సెకండు యాక్టివ్గానే కనిపించింది. అలాగే నితిన్ తో కెమిస్ట్రీ కూడా బాగా కుదిరినట్లు కనిపిస్తోంది.
- సినిమాలో కామెడీ బలంగా కనిపిస్తుంది. నరేష్, నితిన్, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుహాస్, అభినవ్ ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతంగా కామెడీ పండించగల సమర్థులు కాబట్టి సినిమాలో కామెడీ కి కొదవలేదు. ఎంటర్టైన్మెంట్ కు మినిమమ్ గ్యారెంటీ అన్నట్లు ఉంది ట్రైలర్ కట్.
ఇవి రిస్క్ ఎలిమెంట్స్ లా ఉన్నాయి…
- సినిమా ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పేశారు. ఇక ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కూడా కాదు కాబట్టి కొంత మంది ప్రేక్షకులు టాక్ వచ్చాక తేడాగా ఉంటే ఓటిటి లో చూడవచ్చు అని ఆగిపోయే అవకాశం ఉంది.
- విడుదలైన పాటల్లో ఒకే ఒక్క పాట బాగా హిట్ అయింది. ఇక ఈ ట్రైలర్లో కూడా అద్భుతమైన బాణీ ఏదీ ప్రేక్షకులకి తగల్లేదు. ఇది ఒకరకంగా చిన్న మైనస్ అని చెప్పవచ్చు.
- ఈ రకమైన పాత్రలు నితిన్ దాదాపు చాలా సినిమాల్లో పోషిస్తున్నాడు. ప్రేక్షకులకు ఇది బాగా రొటీన్ గా అనిపించవచ్చు. పైగా గొడవపడే హీరో హీరోయిన్ల తర్వాత పెళ్ళి చేసుకోవడం అనేది ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఒక కామన్ ఎలిమెంట్ అయిపోయింది.
Rang De Trailer review :
మొత్తానికి ‘రంగ్ దే‘ ట్రైలర్ ఎంటర్టైనింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది అనే చెప్పాలి. నితిన్, కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగ్గొట్టేశారు. వీరిద్దరి కెమిస్ట్రీ మేజర్ హైలైట్ అవుతుంది. తరువాత దర్శకుడు చెప్పిన మైనస్ పాయింట్స్ అధిగమించేలా స్క్రీన్ ప్లే రాసుకుని… మంచి సన్నివేశాలు పెట్టుకొని ఇంట్రెస్టింగ్గా సినిమా తెరకెక్కిస్తే హిట్ పక్కా.