Rangamarthanda : రంగ మార్తాండ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ జంటగా నటిస్తున్నారు. బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాని, కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీటవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకులు .. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజ సంగీతం అందిస్తున్నారు. చాలాకాలం తర్వాత కృష్ణవంశీ ఇళయరాజా తో పనిచేస్తుండటం విశేషం.
ఇక రమ్యకృష్ణ కూడా కృష్ణవంశీ దర్శకత్వంలో నటించి దాదాపు 20 ఏళ్ళు అవుతోంది. కాగా రంగమార్తాండ మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ఒరిజినల్ వెర్షన్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ పోషించిన పాత్రను రీమేక్ లో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా మీద దర్శకుడు కృష్ణవంశీ కెరీర్ ఆధారపడి ఉందని అంటున్నారు. గత కొన్నేళ్ళుగా కృష్ణవంశీకి హిట్స్ లేవన్న సంగతి తెలిసిందే. మురారి. ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, చందమామ లాంటి బ్లాక్ బస్టర్ దక్కించుకోవడం కోసం చాలా ట్రై చేస్తున్నాడు.
Rangamarthanda : రంగ మార్తాండ సినిమాతో కృష్ణవంశీ మళ్ళీ ఫాం లోకి వస్తాడా..?
ఇక మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో తీసిన గోవిందుడు అందరి వాడేలే సినిమా కూడా కృష్ణవంశీ కి హిట్ ఇవ్వలేకపోయింది. దాంతో రంగ మార్తాండ సినిమాతో మళ్ళీ ఫాం లోకి రావాలని కసిగా ఉన్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ త్వరలో మొదలు పెట్టబోతున్నట్టు తాజా సమాచారం. అంతేకాదు ఈ సమ్మర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట కృష్ణవంశీ. చూడాలి మరి రంగ మార్తాండ సినిమాతో కృష్ణవంశీ మళ్ళీ ఫాం లోకి వస్తాడా లేదా.