డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. సెలబ్రిటీల పై రాజకీయాలపై అదేవిధంగా సమాజాన్ని ప్రభావితం చేసే విషయాలపై ఇది నా అభిప్రాయం అంటూ ఏదో ఒక డైలాగ్ సోషల్ మీడియాలో పెట్టేసి వదిలేస్తారు. అదే మీడియా సర్కిల్ లో బాగా వైరల్ అయ్యి జనాలలో పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. అంతే కాకుండా చాలా వెరైటీ సినిమాలు కూడా తెరకెక్కిస్తారన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో ఓటిటి లో మసాలా సినిమాలు తీసి భారీగా లాభాలు సంపాదించడం జరిగింది. వెరైటీ వెరైటీ సినిమాలతో టాపిక్ లతో ఆకట్టుకున్న రామ్ గోపాల్ వర్మ మీడియా లో నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పేస్తాడు. జీవితంలో తనికి సెక్స్ అన్న అమ్మాయిలు అన్న చాలా ఇష్టమని పొద్దున్నే నిద్ర లేవటం తోనే పోర్న్ చూస్తానని సెన్సేషనల్ కామెంట్లు కూడా చేస్తుంటారు.
ఇప్పుడు ఇదే మాదిరిగా దీపావళి రోజు రామ్ గోపాల్ వర్మ ట్విటర్లో సెక్స్ కంటే ఎక్కువ ఇష్టమైంది ఒకటి ఉందని చెప్పాడు. వరుస ట్వీట్లు చేస్తున్న ఆర్జివి దీపావళి రోజు పండుగ సందర్భంగా నా వంతుగా కాలుష్యం పెరగడానికి సహకరిస్తున్నాను.. దీపావళిని అజాగ్రత్తగా జరపుకోండి..మీ మొహం, కాళ్లు చేతులు కాల్చుకోండంటూ వెరైటీగా పోస్ట్లు చేశాడు. సెక్స్ కంటే పవర్ ఎక్కువ ఇష్టమని.. కావాలంటే ఈ పవర్ ఫుల్ క్రాకర్స్ వెలిగేందుకు నా కళ్లల్లో ఉన్న కామం చూడండి అంటూ వీడియోను షేర్ చేయటంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.