Rapper Badshah: ‘అభి తో పార్టీ షురు హుయ్ హై’, ‘కార్ గయ్ చుల్’, ‘డీజే వాలే బాబు’ వంటి పాటలతో శ్రోతలను ఉర్రూతలూగించిన సింగర్-ర్యాపర్ బాద్షా గురించి ప్రత్యేకంగా ఇంట్రో అవసరం లేదు. హైయ్యెస్ట్ పెయిడ్ సెలబ్రిటీలలో ఒక్కడైనా బాద్షా వ్యక్తిగత విషయాల గురించి కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రధానంగా రెండు పుకార్లు సంచలనం సృష్టిస్తున్నాయి. అతడు తన భార్య జాస్మిన్ నుంచి విడిపోయాడని ఒక రూమర్లు చక్కర్లు కొడుతుండగా.. అతడు పంజాబీ యాక్ట్రెస్ ఇషా రిఖీతో డేటింగ్ చేస్తున్నాడని మరొక రూమర్ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ, ఇషా ఎవరు?
Rapper Badshah: నిజమేనా
ర్యాపర్-సింగర్ బాద్షా అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా. ఈ స్టార్ సింగర్ ఇషా రిఖీతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో వీరిద్దరిలో ఎవరో ఒకరు పెదవి విప్పితే గానీ తెలియదు. ఈ ముద్దగుమ్మతోనే బాద్షా మరోసారి ప్రేమలో పడ్డట్లు సమాచారం. ఇషా రిఖీ ప్రముఖ పంజాబీ యాక్ట్రెస్, రిఖీ చండీగఢ్‌లో నివసిస్తోంది. ఈ తార ఒక బాలీవుడ్ సినిమాలో కూడా చేసింది.
అంతగా ప్రేమలో మునిగి తేలుతున్నారా
ఓ ప్రముఖ బాలీవుడ్ మీడియా వెబ్సైట్ ప్రకారం, బాద్షా ఒక పంజాబీ నటితో ఏడాది నుంచి డేటింగ్ చేస్తున్నాడు. వీరు కామన్ ఫ్రెండ్ పార్టీలో కలుసుకున్నారట. ఆపై వీరు ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఈ పార్టీలో మాట్లాడుకున్న ఇరువురు తమకు మూవీస్, మ్యూజిక్‌లో ఒకటే అభిరుచి ఉందని తెలుసుకున్నారు. అలా వారి మధ్య స్టార్ట్ అయిన ఒక చిన్న పరిచయం ఇప్పుడు ప్రేమకి దారితీసిందని అంటున్నారు. ఈ జంట ప్రస్తుతానికి ప్రేమ వ్యవహారాన్ని మెలమెల్లగా ముందుకు తీసుకెళ్తున్నారట. బాద్షా, ఇషా ఇప్పటికే తమ కుటుంబాలతో తమ రిలేషన్ గురించి చెప్పారని టాక్. కుటుంబ సభ్యులు కూడా వీరి ప్రేమకు అంగీకరించారట.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?