Raj and DK : తెలుగు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే దర్శకులు ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులారిటీని సాధించారో అందరికీ తెలిసిందే. వీరి నుంచి వచ్చే కథాంశాలు అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దీంతో మన సౌత్ స్టార్ హీరోలు, హీరోయిన్స్ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక్కడ ఏలాంటి పాత్ర చేయడానికైనా అవకాశం ఉంది. అందుకే తమలోని సత్తా చూపించేందుకు పూర్తి స్థాయిలో తమలోని నటులను బయటకు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బబ్లీ బ్యూటీ రాశీఖన్నా కూడా వెబ్ సిరీస్ ల వైపు అడుగులు వేస్తోంది.
‘ది ఫ్యామిలీ మ్యాన్ ‘ సిరీస్ ని రూపొందించిన రాజ్ అండ్ డీకే త్వరలో మరో కొత్త వెబ్ సిరీస్ ని ప్రారంభిస్తున్నారు. ఈ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ గా రాశీఖన్నాను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో రాశీఖన్నా పేరు మీడియాలో, ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అవుతోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కి ఓటీటీలో మంచి రేటింగ్ దక్కించుకుంది. ఇక సీజన్ 2 ఫస్ట్ సీజన్ కంటే రెట్టింపు స్థాయిలో హిట్ సాధించింది. అక్కినేని సమంత పార్ట్ 2 లో తీవ్రవాది రాజీ పాత్రలో నటించి ఆకట్టుకుంది.
Raj and DK : రాజ్ అండ్ డీకే హై రేంజ్ లో ఉండే థ్రిల్లర్ సిరీస్ ని రూపొందించబోతున్నారట.
అంతేకాదు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలందుకుంది. ఇదే క్రమంలో రాజ్ అండ్ డీకే ఫ్యామిలీ మ్యాన్ ని మించి హై రేంజ్ లో ఉండే థ్రిల్లర్ సిరీస్ ని రూపొందించబోతున్నారట. కాగా ఇందులో రాశీ ఖన్నా కు ఆఫర్ రావడంతో ఆమెకి కూడా భారీ స్థాయిలో క్రేజ్ రావడం గ్యారెంటీ అంటున్నారు. ఇప్పటి వరకూ హీరోయిన్ గా చేసిన సినిమాలతో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఇప్పుడు నటిగా మరింతగా తన టాలెంట్ చూపించుకునే ఆఫర్ వెబ్ సిరీస్ తో రావడం ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి డిజిటల్ రంగంలో రాశీఖన్నా ఏ మేరకు ఆకట్టుకుంటుందో.