బుల్లితెరపై కమెడియన్ సుడిగాలి సుధీర్ యాంకర్, రష్మి గౌతమ్ జంట సూపర్ హిట్. మధ్య ఏమీ లేదు అని బయట చెబుతూనే తెర మీద ప్రేమాయణం కొనసాగిస్తారు. వీళ్లిద్దరు స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ప్రజలంతా బాగా కనెక్ట్ అవుతుంటారు. దీంతో మరింత రెచ్చిపోతారు ఈ జబర్దస్త్ జోడి ఇప్పటికే వంద మార్కులు కొట్టేశారు. ఇక ఢీ లాంటి డాన్స్ షోలో కూడా వీరి ప్రేమ కథ వచ్చింది అంటే టిఆర్పి తారాజువ్వల పైకి లేస్తోంది.
వీరిద్దరి పెళ్లి గురించి ఒక పెద్ద ఈవెంట్ జరిగింది అంటే అర్థం చేసుకోవచ్చు వీళ్ళ క్రేజ్ ఎలా ఉందో. మొత్తానికి ఇదంతా కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే అని చెప్పినా కూడా వీరిద్దరి కెమిస్ట్రీ ఎంతో సహజంగా ఉండడం గమనార్హం. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది అందులో సుధీర్, రాంప్రసాద్, గెటప్ శీను వేసిన స్కిట్ కొత్త గా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
స్కిట్ లో సుధీర్ కు గర్భం వస్తుంది శ్రీమంతం వేడుకలు జరిపేటప్పుడు సుధీర్ కూర్చోబెట్టి పసుపు కుంకుమ రాస్తారు. ఈ వేడుకల్లో రష్మీ కూడా పాల్గొంటుంది. అసలు ఎలా నెల తప్పావు అంటూ అతనిని సీక్రెట్‌గా అడుగుతుంది. వెంటనే ఒక యాపిల్ పండు ని చూపించి అతని చేతిలో పెట్టి పండు అంత బిడ్డని కనాలి అని కౌంటర్ చేసింది. దీంతో అందరూ నవ్వేశారు.