జబర్దస్త్ యాంకర్ రష్మీకి ప్రస్తుతం అటు బుల్లి తెరపై… ఇటు వెండి తెరపై ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. ఓవైపు జబర్దస్త్, ఢీ లాంటి షోల్లో యాంకర్ గా చేస్తూనే.. మరోవైపు సినిమాలో మెరుస్తోంది. ప్రస్తుతం రష్మీ.. బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో నటిస్తోంది.

ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ఇదివరకే రిలీజ్ అయ్యాయి. తాజాగా.. సినిమా టీజర్ ను మూవీ యూనిట్ గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేసింది.

అక్టోబర్ 2న సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నాం. దద్దరిల్లకపోతే నన్ను అడగండి.. మార్కెట్ లో మతి పోవాలి.. అంతే అని రష్మీ చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె చెప్పినట్టుగానే బొమ్మ బ్లాక్ బస్టరు. దద్దరిల్లిపోయింది. టీజర్ మాత్రం సరికొత్తగా ఉంది.

ఈ సినిమాలో మెయిన్ రోల్ లో నందు, రష్మీ నటిస్తున్నారు. రాజ్ విరాఠ్ డైరెక్టర్. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తికాగా… పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా రిలీజ్ కానుంది.